
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అమ్మపాలెం గ్రామంలోని మైనారిటీ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్‌లో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలుడిని జువాలజీ టీచర్ లైంగికంగా వేధించటంతో సదరు విద్యార్థి తల్లిదండ్రులు కొనిజర్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు కావటంతో మనస్థాపం చెందిన అతడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మైనార్టీ స్కూల్‌లో చదువుతున్న మైనర్ బాలుడును మూడు సంవత్సరాలుగా వేధిస్తున్నాడు. ఇటీవల మైనర్ బాలుడు దసరా సెలవులకు ఇంటికి వెళ్లాడు. టీచర్ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని స్కూల్‌కు తాను వెళ్లనంటూ కన్నీరు పెట్టుకోవడంతో కొడుకు చెప్పిన సమాధానంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు.
ఇది చదవండి: మహిళ స్నానం చేస్తుండగా మెరిసిన ఏదో లైట్.. ఏంటా అని పరిశీలించగా
స్కూల్‌లో తరచూ తనను జువాలజీ టీచర్ ప్రభాకర్ లైంగికంగా వేధిస్తున్నట్లు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై పాఠశాల ప్రిన్సిపాల్‌తో పాటు కొణిజర్ల పోలీసులకు విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా నిందితుడు జువాలజీ టీచర్‌గా పనిచేస్తున్న వ్యక్తిపై కొణిజర్ల పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. టీచర్ వ్యవహారం ఉన్నతాధికారులకు తెలియడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. విషయం బయటికి రావడంతో పరువు పోతుందని ఉపాధ్యాయుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడటంతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఇది చదవండి: రోడ్డుపై పిండం పెట్టారనుకునేరు.. కాస్త జూమ్ చేసి చూడగా కళ్లు తేలేస్తారు