జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముందు అధికార కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఎన్నికల అక్రమాలకు పాల్పడుతోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికల్లో ఎలాగైన గెలవాలని కాంగ్రెస్ అన్ని అడ్డగోలుదారుల్లో ప్రయత్నాలు చేస్తుందన్నారు. మొత్తం రాష్ట్ర మంత్రులంతా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేరి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్, ఎన్నికల ప్రధాన అధికారి సీఈవోకు కేటీఆర్ వినతిపత్రం అందజేశారు.
నామినేషన్ ప్రక్రియను పూర్తి చేసే ముందు మోసపూరిత ఓట్లను తొలగించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KT రామారావు ఎన్నికల సంఘాన్ని కోరారు, లేకుంటే BRS న్యాయం కోసం కోర్టులను ఆశ్రయిస్తుంది తెలిపారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్‌లో ఒక్కో వ్యక్తికి రెండు, మూడు ఓటర్ ఐడీ కార్డులు ఉన్నాయని.. ఒకే అడ్రస్‌తో ఒక్కొక్కరు మూడు, నాలుగు పేర్లు నమోదు చేయించుకున్నారని ఆరోపించారు. ఒకే వ్యక్తికి అక్షరాలను మార్చి అనేకసార్లు ఓటర్లుగా నమోదు చేయించినట్టు చెప్పుకొచ్చాడు. ఈ వివరాలన్నీ ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్ నుంచి తీసుకున్నవేనని తెలిపారు.
ఒక వైపు జాతీయస్థాయిలో రాహుల్‌గాంధీ ఓటు చోరీ అంటుంటే ఇక్కడ కాంగ్రెస్ మాత్రం దొంగ ఓట్లతో గెలిచే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.