వరంగల్ కాశీబుగ్గ ప్రాంతంలో కొందరు వ్యక్తులు మధ్య మత్తులో రెచ్చిపోయారు. ఓ బార్‌లో మద్యం సేవిస్తున్న క్రమంలో మాట మాట పెరిగి విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. పిడిగుద్దులతో వీరంగం సృష్టించిన ఆ మందుబాబులు ప్రశ్నించిన వారిపై ప్రతాపం చూపారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని వివరాలు సేకరించారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ఈ ఫైటింగ్ సీన్ పై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. అచ్చం సినిమా ఫైటింగ్‌ను తలపించేలా జరిగిన ఈ దాడి ఘటన వరంగల్ కాశిబుగ్గ ప్రాంతంలోని “కాళిక బార్” లో జరిగింది.. మద్యంమత్తులో వీరంగం సృష్టించారు ఒక వర్గానికి చెందిన వ్యక్తులు.. ఇద్దరు యువకులపై విచక్షణా రహితంగా దాడిచేసి గాయపరిచారు. బార్ లోపల లాన్‌లో మద్యం తాగుతున్న క్రమంలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. నలుగురు వ్యక్తులు ఒకవైపు నిలబడి మద్యం తాగుతున్నారు.. వారిలో ఒకవ్యక్తి వచ్చి పక్కన మద్యం తాగుతున్న వ్యక్తులతో గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే మాట మాట పెరిగింది.. వారి పక్కనే ఉన్న మరో యువకుడు వచ్చి వారిని ఆపే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతనిపై దాడికి పాల్పడ్డాడు.. మధ్య మధ్యలో ఆ నలుగురు వ్యక్తులు విచక్షణ రహితంగా దాడి చేశారు.
అయితే.. ఈ దాడిని ఆపడానికి ప్రయత్నించిన బార్ షాపు నిర్వాహకులతో సహా స్థానికులపై కూడా విచక్షణ రహితంగా దాడి చేశారు మందుబాబులు.. ఇనుప రాడ్డుతో కొట్టి గాయపరిచారు.. ఈ దాడి దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యాయి.. ఈ దుండగుల దాడిలో ప్రాణాలతో బయటపడ్డ బాధితులు ఏనుమాముల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వీడియో చూడండి..
ఏనుమాముల పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి పోకిరీలు నిత్యం మారణాయుధాలతో బీభత్సం సృష్టిస్తున్నట్లుగా స్థానికులు చెప్తున్నారు. వారి నుంచి ప్రాణ హాని ఉందని తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే విచక్షణరహితంగా దాడులు చేస్తున్నారని.. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..