Bysanivaripalle Smoke Free Village With Solar: అన్నమయ్య జిల్లా బైసానివారిపల్లెలో వినూత్న ప్రయోగం. నెడ్‌క్యాప్ ఆధ్వర్యంలో, గ్యాస్, కట్టెల పొయ్యి లేకుండా కేవలం సూర్యరశ్మితో వంటలు చేస్తున్నారు. ప్రత్యేక గొడుగుల వంటి సెటప్‌తో 35 కుటుంబాలు పొగలేని వంటలు చేసుకుంటూ కాలుష్య రహిత గ్రామానికి బాటలు వేస్తున్నాయి. పిండి వంటలు, చిరుధాన్యాలు, ఉలవలు వంటివి సుమారు 25 నిమిషాల్లో ఉడుకుతున్నాయి. ఈ ఆలోచిన బావుంది అంటూ ప్రశంసలు కూడా వస్తున్నాయి.
హైలైట్:
- ఏపీలోని ఆ ఊరిలో సూర్యరశ్మి ద్వారా వంటలు
- ఊరిలోని ఇళ్లపై గొడుగులు ఏర్పాటు చేసి నెడ్‌క్యాప్
- ఆ గొడుగుపై వంట పాత్ర కోసం ఇనుప చువ్వలు
- సూర్యరశ్మి సాయంతో 25 నిమిషాల్లోనే వంట పూర్తి

బైసానివారిపల్లెలోని దాదాపు 35 కుటుంబాలకు ఇలా నెడ్‌క్యాప్ సూర్యరశ్మి ద్వారా వంట చేసుకునేందుకు ఒక సెటప్ ఏర్పాటు చేసింది. ఆ కుటుంబాలకు గొడుగుల్ని అధికారులు అందజేశారు.. ఇంటిపైన ఏర్పాటు చేసిన ఈ గొడుగు మధ్యలో వంట పాత్రలు ఉంచడానికి వీలుగా ఇనుప చువ్వలతో ఒక సెటప్ ఉంటుంది. పై నుంచి ఎండ వచ్చినప్పుడు గొడుగును సూర్యునికి ఎదురుగా ఉంచి వంటపాత్రను ఇనుప చువ్వలపై పెడతారు.. అప్పుడు పాత్రలోపల ఉండేవి ఉడుకుంది.
AIతో వంటకాలు.. చిల్లీ పన్నీర్ టేస్ట్ చేసిన సీఎం చంద్రబాబు
ఇలా వంట చేయడానికి దాదాపు 25 నిమిషాల సమయం పడుతుంది అంటున్నారు. స్థానికులు పిండి, చిరుధాన్యాలతో చేసే వంటలు ఎక్కువగా చేసుకుంటున్నారు. అంతేకాదు ఉలవలు, వేరుసెనగ కాయలు వంటివి ఉడికిస్తున్నారు. గ్రామంలో ఇలా ఈ గొడుగు వంటి సెటప్ ద్వారా ఈ పొయ్యి పైనే గ్రామస్థులు వంట చేసుకుంటున్నారు. చాలామంది ఈ విధానం ఏదో బావుంది అంటున్నారు.. ఇలా సూర్యరశ్మి ద్వారా వంట చేయడానికి కాస్త సమయం అయితే పడుతుందని చెబుతున్నారు.