Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

కోరింత దగ్గు చిన్నారులకు ప్రాణాంతకం.. గర్భిణిగా ఉన్నప్పుడే టీకా వేస్తే

14 October 2025

Kubera Temple: మన దేశంలో కుబేరుడికీ గుడి ఉందని తెలుసా.. ఒక్కసారి దర్శించుకున్నా.. జీవితంలో డబ్బుకి ఇబ్బందే ఉండదు..

14 October 2025

Post Office: పోస్టాఫీస్ బంపర్ ఆఫర్.. ఇంటికే రైల్వే టికెట్.. ఇలా చేస్తే చాలు..

14 October 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap Govt Mou With Google,ఏపీకి రూ.88 వేల కోట్ల పెట్టుబడి.. గూగుల్‌తో ఒప్పందం, 1.88 లక్షల ఉద్యోగాలు – ap govt signed mou with google to construct largest google data center in visakhapatnam
ఆంధ్రప్రదేశ్

Ap Govt Mou With Google,ఏపీకి రూ.88 వేల కోట్ల పెట్టుబడి.. గూగుల్‌తో ఒప్పందం, 1.88 లక్షల ఉద్యోగాలు – ap govt signed mou with google to construct largest google data center in visakhapatnam

.By .14 October 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap Govt Mou With Google,ఏపీకి రూ.88 వేల కోట్ల పెట్టుబడి.. గూగుల్‌తో ఒప్పందం, 1.88 లక్షల ఉద్యోగాలు – ap govt signed mou with google to construct largest google data center in visakhapatnam
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఆంధ్రప్రదేశ్‌ను ఏఐ హబ్‌గా మార్చేందుకు విశాఖపట్నంలో కీలక ముందడుగు పడింది. వైజాగ్‌లో 1 గిగావాట్ హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో గూగుల్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఢిల్లీలోని తాజ్‌మాన్‌సింగ్‌ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో ఒప్పందంపై ఇరు వర్గాల ప్రతినిధులు సంతకాలు చేశారు. దాదాపు 10 బిలియన్ డాలర్ల పెట్టుబడితో అసియాయాలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ నిర్మించనుంది గూగుల్. ఈ ప్రాజెక్ట్ ద్వారా 2028-2032 మధ్య రాష్ట్ర జీడీపీకి ఏటా రూ.10,518 కోట్లు, 1.88 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభించనున్నట్లు అంచనాలు ఉన్నాయి.

హైలైట్:

  • ఏపీ ప్రభుత్వంతో గూగుల్ ఒప్పందం
  • విశాఖలో ఏఐ డేటా సెంటర్ నిర్మించనున్న గూగుల్
  • రూ.88 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్న గూగుల్
ap govt signed mou with google
ఏపీకి రూ.88 వేల కోట్ల పెట్టుబడి.. గూగుల్‌తో ఒప్పందం, 1.88 లక్షల ఉద్యోగాలు(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్‌ను టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కీలక ముందడుగు పడింది. టెక్ దిగ్గజం గూగుల్.. విశాఖపట్నంలో 1 గిగావాట్‌ హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో మంగళవారం ఢిల్లీలో అవగాహన (ఎమ్ఓయూ) ఒప్పందం కుదుర్చుకుంది. తాజ్‌మాన్‌సింగ్‌ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో.. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఐటీ, కమ్యూనికేషన్ల శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, గూగుల్‌ క్లౌడ్‌ సీఈఓ థామస్‌ కురియన్, గ్లోబల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ బికాస్‌ కోలే, గూగుల్‌ క్లౌడ్‌ ఆసియా ఫసిఫిక్‌ విభాగం అధ్యక్షుడు కరణ్‌ బజ్వాలు పాల్గొన్నారు.

1.88 లక్షల ఉద్యోగాలు..!

విశాఖను ఏఐ సిటీగా మార్చేందుకు ఈ ఒప్పందం పునాది వేయనుంది. సుమారు 10 బిలియన్‌ డాలర్ల (రూ.88,628 కోట్ల) పెట్టుబడితో.. 1 గిగావాట్‌ హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు చేయనుంది గూగుల్. ‘గూగుల్‌ ఏఐ హబ్‌’ పేరుతో భారత్‌లోనే తొలి కృత్రిమ మేధస్సు కేంద్రం ఏర్పాటుకు ఏపీ సర్కార్ విశాఖపట్నంలో ( google ai data center vizag ) శ్రీకారం చుట్టనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 2028- 2032 మధ్య.. రాష్ట్ర స్థూల ఉత్పత్తికి ఏటా రూ.10,518 కోట్లు సమకూరుతుందనే అంచనాలు ఉన్నాయి. అంతేకాకుండా దాదాపు 1,88,220 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాల కల్పనకు కూడా (google data center vizag jobs) అవకాశం ఏర్పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ డేటా సెంటర్ అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ఐటీ ఎకోసిస్టమ్ మొత్తం మారిపోనుంది. వైజాగ్ ఏఐ సిటీగా మారిపోనుంది.

రాష్ట్రానికి కొత్త ఆదాయ వనరు..

ఈ డేటా సెంటర్.. ఆధునిక ఆర్థిక మౌలిక సదుపాయాలకు మూలస్తంభంగా నిలుస్తుందని ఇటీవల ప్రభుత్వం చెప్పింది. AI, క్లౌడ్ కంప్యూటింగ్, IoT (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్), 5G, ఇ-గవర్నెన్స్ ప్లాట్‌ఫామ్‌లను వేగవంతం చేస్తుందని చెప్పింది. ఈ డేటా సెంటర్ ద్వారా.. .. విద్యుత్, ఫైబర్ ఆప్టిక్స్, రియల్ ఎస్టేట్, టెలికమ్యూనికేషన్స్ వంటి అనుబంధ రంగాలకు ఊతం లభిస్తుందని పేర్కొంది. ఫలితంగా రోడ్డు, విద్యుత్, ఫైబర్ కనెక్టివిటీకి డిమాండ్‌ పెరుగుతుందని తెలిపింది. ఇవన్నీ జరిగితే.. ఎలక్ట్రిసిటీ డ్యూటీ, ఆస్తి పన్ను, SGST ద్వారా రాష్ట్రానికి ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

ఏఐలో ఆంధ్రప్రదేశ్‌ని అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. అందులో భాగంగా మంత్రి నారా లోకేశ్‌ గతేడాది అక్టోబర్ 31న అమెరికాలో పర్యటించారు. ఈ పర్యటన సందర్భందగా శాన్‌ ఫ్రాన్సిస్కోలోని గూగుల్‌ క్లౌడ్‌ సీఈవో థామస్‌ కురియన్‌తో చర్చలు జరిపారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. ఆ తర్వాత గూగుల్‌ ప్రతినిధులతో పలు దఫాలుగా చర్చలు జరిగాయి. అనంతరం విశాఖలో పెట్టుబడి పెట్టనున్నట్లు గూగుల్ ప్రకటించింది. అమెరికా వెలుపల గూగుల్ నిర్మించనున్న అతిపెద్ద డేటా సెంటర్ ఇదే కావడం గమనార్హం. అయితే ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి.. యువతలో ఏఐ నైపుణ్యాభివృద్థికి వివిధ కార్యక్రమలను ప్రభుత్వం అమలు చేయనుంది.

భూపతి రాజు

రచయిత గురించిభూపతి రాజుభూపతి రాజు సమయం తెలుగులో కాపీ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ట్రెండింగ్ సహా వివిధ అంశాలపై ప్రత్యేక కథనాలు రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయం, అంతర్జాతీయం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు, విశ్లేషణలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 3 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ETV భారత్ సంస్థలో జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్, స్పోర్ట్స్, సినిమా న్యూస్ రాశారు. లోక్‌సభ ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. భూపతి రాజు ఈనాడు జర్నలిజం స్కూల్‌ (EJS) నుంచి జర్నలిజంలో పీజీ డిప్లొమా పూర్తి చేశారు.… ఇంకా చదవండి