Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Credit cards: క్రెడిట్ కార్డు లిమిట్ పెరగాలా? సింపుల్‌గా ఈ టిప్స్ ఫాలో అయితే చాలు!

14 October 2025

చీమలు తయారుచేసిన యోగర్ట్‌ ను చూశారా

14 October 2025

ఇక నో టెన్షన్.. ఇమ్యూనిటీ ప‌వర్‌‌ పెరగాలంటే ఇలా చేయండి.. బెస్ట్ ఫుడ్స్‌తో రోగాలకే చెక్..

14 October 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Anakapalle Real Estate Grown,ఏపీలోని ఆ ప్రాంతానికి క్యూ కట్టిన కంపెనీలు.. భూముల ధరలకు రెక్కలు.. రిజిస్ట్రేషన్లు కళ, కళ – land transactions and registrations income increased in anakapalle district
ఆంధ్రప్రదేశ్

Anakapalle Real Estate Grown,ఏపీలోని ఆ ప్రాంతానికి క్యూ కట్టిన కంపెనీలు.. భూముల ధరలకు రెక్కలు.. రిజిస్ట్రేషన్లు కళ, కళ – land transactions and registrations income increased in anakapalle district

.By .14 October 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Anakapalle Real Estate Grown,ఏపీలోని ఆ ప్రాంతానికి క్యూ కట్టిన కంపెనీలు.. భూముల ధరలకు రెక్కలు.. రిజిస్ట్రేషన్లు కళ, కళ – land transactions and registrations income increased in anakapalle district
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Anakapalle Land Registrations Income: ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు, కంపెనీలు క్యూ కట్టాయి. ప్రధానంగా విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు కూడా పెట్టుబడులు వచ్చేశాయి. రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంది. అనకాపల్లి జిల్లాలో మిత్తల్ స్టీల్ ప్లాంట్, డ్రగ్ పార్కుల రాకతో భూముల ధరలు పెరిగి, రిజిస్ట్రేషన్ల ఆదాయం లక్ష్యాలను అధిగమించింది. ఈ ఆర్థిక సంవత్సరం సగం పూర్తయ్యేలోపే జిల్లాలో నిర్దేశించిన లక్ష్యం కంటే ఎక్కువ ఆదాయం సమకూరింది.

హైలైట్:

  • అనకాపల్లి జిల్లాలో రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నాయి
  • ఈ ఆర్థిక సంవత్సరం సగం పూర్తయ్యేలోపే టార్గెట్
  • నిర్దేశించిన లక్ష్యం కంటే ఎక్కువ ఆదాయం వచ్చింది
Anakapalle Land Registrations
అనకాపల్లి జిల్లాలో రిజిస్ట్రేషన్ల కళ కళ(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు వస్తున్నాయి.. ఐటీ కంపెనీలు, పరిశ్రమలు క్యూ కట్టాయి. ముఖ్యంగా విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు కంపెనీలు వస్తున్నాయి.. అనకాపల్లి జిల్లాకు మిత్తల్ స్టీల్ ప్లాంట్‌తో పాటుగా డ్రగ్ పార్క్‌లు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో అనకాపల్లి జిల్లాలో రియల్ బూమ్ అందుకుంది.. భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో రిజిస్ట్రేషన్లు కూడా ఊపందుకున్నాయి. అనకాపల్లి జిల్లాలో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయ లక్ష్యాలను అధిగమించింది. ఈ ఆర్థిక సంవత్సరం సగం పూర్తయ్యేలోపే జిల్లాలో నిర్దేశించిన లక్ష్యం కంటే ఎక్కువ ఆదాయం సమకూరింది. అనకాపల్లి జిల్లాలో పారిశ్రామిక రంగం పురోగతి, పెట్టుబడుల పెరుగుదల, రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకోవడంతో దీనికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. ఈ ఏడాది చివరి నాటికి 100శాతం లక్ష్యాన్ని చేరుకునే దిశగా అడుగులుపడుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో లక్ష్యంలో సగం మాత్రమే ఆదాయం వచ్చింది. కానీ ఈ ఏడాది ప్రారంభం నుంచే భూముల క్రయ, విక్రయాలు పెరిగాయి. ప్రభుత్వం పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహిస్తూ, భారీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఇప్పటికే ఉన్న పరిశ్రమలతో పాటు కొత్త పరిశ్రమలు వస్తుండటంతో రియల్ ఎస్టేట్ రంగం కూడా పుంజుకుంది. ఈ పరిస్థితులన్నీ రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరగడానికి దోహదపడుతున్నాయి. జిల్లాలోని కొన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో అధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరగడంతో, అవి తమ లక్ష్యాలను దాటేశారు.

అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి, ఎలమంచిలి, నర్సీపట్నం, సబ్బవరం కార్యాలయాలు ఈ ఆర్థిక సంవత్సరంలో పురోగతి సాధించాయి. నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించి, గతంలో ఎన్నడూ లేని విధంగా ఆదాయాన్ని ఆర్జించాయి. ఆర్థిక సంవత్సరం రిజిస్ట్రేషన్ కార్యాలయాలు క్రయ, విక్రయదారులతో సందడిగా మారాయి. ఈ ఏడాది రూ. 319 కోట్ల లక్ష్యానికి గాను, తొలి ఆరు నెలల్లోనే రూ. 161.88 కోట్ల ఆదాయం సమకూరింది. గతేడాదితో పోల్చితే వృద్ధి రేటు గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి రిజిస్ట్రేషన్ల విషయంలో తీసుకొచ్చిన సంస్కరణలతో పాటూ ధరల్లో మార్పులతో ఆదాయం పెరిగిందని చెబుతున్నారు అధికారులు. అంతేకాదు ఎలమంచిలి, నక్కపల్లి కార్యాలయాల్లో పారిశ్రామీకరణ ప్రభావంతో ఆదాయం భారీగా పెరిగిదంటున్నారు. రిజిస్ట్రేషన్లలో వేగం, వెంటనే డాక్యుమెంట్లు అందజేస్తుండటంతో సేవలు బాగా మెరుగుపడ్డాయంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో అనుకున్నా లక్ష్యాన్నీ చేరుకుంటామని నమ్మకంతో ఉన్నారు.

చంద్రబాబు సీఈవో ఆఫ్ ఆంధ్ర.. మంచి అడ్మినిస్ట్రేటర్

ఓవరాల్‌గా ఆంధ్రప్రదేశ్‌లో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంతో పోలిస్తే, 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం 46 శాతం పెరిగింది. ఈ వృద్ధి రేటు 39 శాతంగా నమోదైంది. రాష్ట్ర రాజధాని అమరావతితో పాటు, గుంటూరు, విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, రాజమహేంద్రవరం వంటి ప్రధాన నగరాల్లో భూముల అమ్మకాలు, కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయి. అనకాపల్లి జిల్లాల్లో కూడా ఆదాయం పెరగడం విశేషం.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి