గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో ఉన్న ధర్మాజ్ అనే మారుమూల గ్రామం.. మిగతా గ్రామాల్లాంటిది కాదు. ఇది దేశంలోనే ధనిక గ్రామంగా రికార్డుకెక్కింది. ఆ గ్రామానికి చెందిన ఎన్నారైలు చేసిన బ్యాంకింగ్ డిపాజిట్లతో అది అత్యంత ధనిక గ్రామంగా మారింది. ధర్మాజ్ గ్రామ ప్రజల అందరి బ్యాంక్ బ్యాలెన్స్ కలిపితే ఏకంగా రూ. వెయ్యి కోట్లు దాటుతుంది. ఈ ఊరి ప్రజల ఐక్యమత్యం మిగతా గ్రామాల వాళ్లకు ఆదర్శంగా నిలుస్తోంది.
ఎన్నారై కుటుంబాలు
ధర్మాజ్ లో సుమారు 3 వేల కుటుంబాలు ఉంటే అందులో 1,700 కుటుంబాలు బ్రిటన్‌లో, 800 కుటుంబాలు అమెరికాలో, 300 కుటుంబాలు కెనడాలో, 150 కుటుంబాలు ఆస్ట్రేలియాలో స్థిరపడ్డాయి. అయితే దేశం విడిచి వెళ్లినా వాళ్లు వాళ్ల మూలాలతో సంబంధాలను తెంచుకోలేదు. ధర్మాజ్ గ్రామానికి వెన్నెముక అయ్యి అభివృద్ధి చేస్తూ వచ్చారు. ఇప్పుడా గ్రామంలో ఎక్కడ చూసినా సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాట్లు ఉంటాయి. రోడ్ల వెంట చెత్త, మురికి నీరు వంటివి లేకుండా గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దుకున్నారు.
హ్యాపీ లైఫ్
ధర్మాజ్ గ్రామంలో 11 బ్యాంకు శాఖలు ఉన్నాయి. వీటిలో కేవలం గ్రామస్తుల అకౌంట్లలోని బ్యాలెన్సే రూ. 1,000 కోట్లకు పైగా ఉంటుంది. అంతేకాదు గ్రామ వీధుల్లో రోల్స్ రాయిస్ వంటి లగ్జరీ కార్లు తిరుగుతాయి. అక్కడి చెరువుల్లో గ్రామస్తులు బోటింగ్ వంటివి చేస్తూ లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తుంటారు.
ఏదేమైనా ధర్మాజ్ ఊరు.. కేవలం ఆస్తి విషయంలోనే కాదు, ఐక్యత, ఆశయం వంటి విషయాల్లో కూడా చాలామందికి ఇనిస్పిరేషన్ గా నిలుస్తోంది. ఒక గ్రామం ఎలా ఉండాలో ఇతర గ్రామాలకు నేర్పుతుంది. మీ నేల మీద మీకు అభిమానం ఉంటే అందరూ కలిసి గ్రామాన్ని అభివృద్ది చేయడమే కాకుండా కలిసి ఆనందంగా కూడా జీవించొచ్చని రుజువు చేస్తోంది.