బిగ్ బాస్ హౌస్ లో రచ్చ రచ్చ జరుగుతుంది. ప్రస్తుతం హౌస్ లోకి కొత్త హౌస్ మేట్స్ వచ్చిన విషయం తెలిసిందే.. వైల్డ్ కార్డు ఎంట్రీతో ఆరుగురు కొత్త హౌస్ మేట్స్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్ రమ్య మోక్ష, టాలీవుడ్ యంగ్ హీరో శ్రీనివాస్ సాయి, దువ్వాడ (దివ్వల)మాధురి, సీరియల్ నటుడు నిఖిల్ నాయర్, సీరియల్ నటి ఆయేషా జీనథ్. సీరియల్ నటుడు గౌరవ్ గుప్తా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక కొత్తవారు రావడంతోనే రచ్చ రచ్చ మొదలైంది. నిన్నటి ఎపిసోడ్ లో దువ్వాడ మాధురికేబీ కళ్యాణ్ కు మధ్య పెద్ద గొడవే జరిగింది. చిన్న విషయానికి దువ్వడం మాధురి పెద్ద రచ్చే చేశారు. కళ్యాణ్ కూడా ఎక్కడా తగ్గకుండా కౌంటర్లు ఇచ్చాడు.
ఇక నేటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రమో ను విడుదల చేశారు. ఈ ప్రోమోలో నామినేషన్స్ చూపించారు. బజార్ మోగగానే హౌస్ లోకి ఓ బాల్ పంపించారు. ఆ బాల్‌ను క్యాచ్ చేసి తమకు నచ్చిన వారికి ఇవ్వాలి ఆ బాల్ అందుకున్న వారు మిగిలిన వారిలో ఒకరిని నామినేట్ చేయాలి.. అందుకు సారైనా పాయింట్ చెప్పాల్సి ఉంటుంది. కాగా ప్రోమోలో ముందు రాము రాథోడ్, రీతూ చౌదరి మధ్య గొడవ జరగడం చూపించారు. ఇద్దరూ కాసేపు వాదించుకున్నారు. అలాగే మాధురి భరణితో వాదన పెట్టుకుంది. దానికి భరణి చాలా ఓపికగా కూల్ గా సమాధానం చెప్పాడు..
ఇక హౌస్ లోకి వచ్చిన బాల్ కోసం హౌస్ మేట్స్ పోటీపడ్డారు. ఫైనల్ గా ఆ బాల్ మాధురి చేతికి చేరింది. ఆ బాల్ ను రీతూకి ఇచ్చింది మాధురి.. దాంతో రీతూ.. భరణిని నామినేట్ చేసింది.. అందుకు పాయింట్ గా మీరు మాట ఇస్తే చేస్తారనే నమ్మకం పోయింది అని అన్నది. దానికి భరణి నేను ఏం మాట ఇచ్చాను.. నేను మాట ఇచ్చిన తరువాత నువ్వెన్ని టాస్క్‌లు ఆడావ్ అని అడిగాడు.. కెప్టెన్ గా ఉన్నప్పుడు నాకు సపోర్ట్ చేయలేదు అని రీతూ చెప్పుకొచ్చింది. దానికి కూడా భరణి గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. భరణితో పాటు దివ్యనిఖితని నామినేట్ చేస్తూ.. ‘నువ్వు దోసె సరిగా వేయలేదు.. కరెక్ట్ టైమ్‌కి బ్రేక్ ఫాస్ట్ ఇవ్వలేదు’ అంటూ చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి
ఆతర్వాత సంజన కు బాల్రావడంతో ఆమె రాముని నామినేట్ చేసింది..నన్ను లోపల పడుకోనీయలేదు.. నీకు మానవత్వం లేదు అంటూ రాము పై ఫైర్ అయ్యింది. మాచెల్లి మా అక్క ఉన్నా నేను అదే చేస్తాను అని రాము కూడా సమాధానం చెప్పాడు. అలాగే భరణిని కూడా మానవత్వం లేదని సంజన అనడంతో.. ఆయన సీరియస్ అయ్యాడు. మాట్లాడే ముందు ఎదుటి వాళ్లు అన్నది కూడా తీసుకోవాలి అని అన్నాడు భరణి.. మొత్తానికి నేటి ఎపిసోడ్ ఆసక్తికరంగా ఉండనుందని ఈ ప్రోమో చూస్తే అర్ధమవుతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.