Dhantrayodashi: ధన్‌తేరాస్ .. (ధన త్రయోదశి) ఈ ఏడాది అక్టోబర్ 18న వస్తుంది. ధన్‌తేరాస్ రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి హిందువులు పలు రకాల పూజాది కార్యక్రమాలు చేస్తుంటారు. అలాగే, చాల మంది బంగారం, వెండి, చీపుర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు వంటివి కొనుగోలు చేస్తుంటారు. ఇలా చేస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు. అలాగే, అన్నదానం చేయడం, యమదీపం వెలిగించడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుందని, ఇంటికి శ్రేయస్సును కలిగిస్తుందని విశ్వాసం. అయితే, రాశుల ప్రకారం ధన్‌తేరాస్ రోజున ఏ రాశివారు ఏం కొనాలో ఇక్కడ తెలుసుకుందాం…
మేషరాశి: మేషరాశిమేషరాశి వారు ఈ ధన త్రయోదశికి బంగారం లేదా ఎర్రటి వస్తువులను కొనుగోలు చేయడం మంచిది. దీంతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
వృషభరాశి: వృషభరాశివృషభరాశి వారు ధన త్రయోదశికి వెండి కొనుగోలు చేస్తే మంచిది. శుక్రుడుతో సంబంధం ఉండే ఈ రాశి వారు సిల్వర్ కాయిన్స్ లేదా ఆభరణాలు వంటివి కొనుగోలు చేయాలి.
ఇవి కూడా చదవండి
మిధున రాశి: మిధున రాశిమిధున రాశి వారు ధన త్రయోదశి రోజు పుస్తకాలు, స్టేషనరీ, గాడ్జెట్లు వంటివి కొనుగోలు చేస్తే మంచిది. బంగారు ఆభరణాలు లేదా కాయిన్స్ కొనుగోలు కూడా కొనొచ్చు.
కర్కాటక రాశి: కర్కాటక రాశి వారు ఈ ధన త్రయోదశి రోజు వంటింటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తే మంచిది. ముఖ్యంగా రాగి లేదా కాంస్య వస్తువులు కొంటే మంచి ఫలితాలు ఉంటాయి.
సింహ రాశి: సింహ రాశి వారు బంగారం, ఆభరణాలు, కాయిన్స్ వంటివి కొనుగోలు చేయడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
కన్య, తులా రాశి వారు: కన్య రాశి వారు ఆరోగ్యం, శుభ్రతకి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తే మంచిది. తులా రాశి వారు ఈ ధనత్రయోదశి రోజు వెండి ఆభరణాలను కొనుగోలు చేస్తే బాగా కలిసి వస్తుంది.
వృశ్చిక, ధనుస్సు: రాశివృశ్చికరాశి వారు బంగారు కాసులు లేదా ఆభరణాలు కొనుగోలు చేస్తే బాగా కలిసి వస్తుంది. ఎర్రటి వస్తువులు కూడా కొనుగోలు చేయొచ్చు. ధనుస్సు రాశి వారు చదువు, ట్రావెల్‌కి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తే మంచిది.
మకరరాశి, కుంభరాశి: మకరరాశి వారు ఏవైనా మెటల్స్ కొనుగోలు చేస్తే బాగుంటుంది. అలాగే గృహోపకరణ వస్తువులను కూడా కొనుగోలు చేయొచ్చు. కుంభరాశి వారు గాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, వెండి ఆభరణాలు, కాయిన్స్ కొంటే మంచిది.
మీనరాశి: ఈ ధన త్రయోదశికి మీనరాశి వారు బంగారం లేదా నీటికి సంబంధించిన డెకర్ వస్తువులను కొనుగోలు చేస్తే బాగా కలిసి వస్తుంది.
Note : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..