ఈ మధ్య కాలంలో క్రెడిట్ కార్డు వినియోగం బాగా పెరిగింది. చాలామంది ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. అయితే ప్రతి క్రెడిట్ కార్డుకి కొంత లిమిట్ ఉంటుంది. వాడకాన్ని బట్టి లిమిట్ పెరుగుతుంది. ఒకవేళ మీరు మీ క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుకోవాలి అనుకుంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
లిమిట్ ఎందుకు పెంచుకోవాలంటే..
క్రెడిట్ కార్డులు వాడేవాళ్లు లిమిట్ ను పూర్తిగా వాడుకోవడం ద్వారా సిబిల్ స్కోర్ తగ్గే అవకాశం ఉంటుంది. మంచి క్రెడిట్ స్కోర్ కోసం కార్డు లిమిట్ లో 30% లోపు మాత్రమే ఉపయోగించుకోవాలి. మరి ఇలాంటప్పుడు ఎక్కువ మొత్తంలో వాడుకోవడం కుదరదు. కాబట్టి కార్డు లిమిట్ పెంచుకోవడం ఒక్కటే ఆప్షన్. ఓవరాల్ లిమిట్ పెరిగితే వాడుకోగలిగిన మొత్తం కూడా పెరుగుతుంది. అందుకే లిమిట్ పెంచుకోవడం అవసరం.
క్రెడిట్ స్కోర్ ను బట్టి..
క్రెడిట్ లిమిట్ అనేది క్రెడిట్ స్కోర్‌ను బట్టి ఆధారపడి ఉంటుంది. మీ నెలవారీ ఈఏంఐలు ఎప్పుడూ స్కిప్ చేయకుండా బిల్లులు కడుతున్నట్టయితే బ్యాంకులు ఆటోమేటిక్ గా క్రెడిట్ లిమిట్ పెంచుతాయి. లేదా మీరే లిమిట్ పెంచమని రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు.
క్రెడిట్ యుటిలైజేషన్
క్రెడిట్ కార్డులు వాడేవాళ్లు క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో ఎంత ఉందో గమనిస్తుండాలి. అంటే మీకు ఉన్న అన్ని కార్డుల లిమిట్ లో మొత్తం ఎంత వాడుతున్నారు అన్నది చూసుకుంటూ ఉండాలి. మీ కార్డుల లిమిట్ లో 30% కంటే తక్కువగా యుటిలైజ్ చేసుకోవాలి. అలాగే ఆ బిల్లులను సకాలంలో కట్టాలి.
శాలరీ హైక్
మీ ఆదాయాన్ని బట్టే సంస్థలు మీకు క్రెడిట్ కార్డులు ఇస్తుంటాయి. ఒకవేళ మీ ఆదాయం లేదా శాలరీ పెరిగితే క్రెడిట్ కార్డు లిమిట్ కూడా పెరుగుతుంది. అందుకే లిమిట్ పెంచుకోవాలి అనుకునేవాళ్లు ఆదాయాన్ని కూడా పెంచుకునే ప్రయత్నం చేయాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.