ఏంటి మీరు దీన్ని పసరిక పాము అనుకున్నారా..? అయితే పప్పులో కాలేసినట్లే.. ఈ పాము పేరు పేరు స్పాట్ టెయిల్డ్ పిట్ వైపర్. అత్యంత విషపూరితమైనది. కాటేస్తే ప్రాణానికే ప్రమాదం. అయితే ఈ పాము అంతరించిపోయే దశంలో ఉంది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1978 ప్రకారం ఈ పాము నాలుగో షెడ్యూల్‌లో ఉండగా.. వాటి ఉనికిని కాపాడేందుకు 2022లో ఒకటో షెడ్యూల్‌లోకి మార్చారు. పాములు చిత్తడి నేలల్లో ఎక్కువగా జీవనం సాగిస్తాయి. ఈ పాము కాటు పడితే.. లోపల బ్లడ్ క్లాట్స్ ఏర్పడతాయి. దీంతో బ్రెయిన్ డెడ్ అవ్వడం, హార్ట్ అటాక్, కోమాలోకి వెళ్లడం వంటివి జరుగుతాయి. అయితే ఈ పాములు సంతతి చాలా తక్కువగా ఉండటంతో.. ఇటీవలి కాలంలో అలాంటి కేసులు ఏమీ నమోదు కాలేదు. పొడ పాము జాతికి చెందిన ఈ పాములు పగటి పూట పూర్తిగా నిద్రలో ఉంటాయి, రాత్రి వేళ వేటకు బయలుదేరతాయి.
పచ్చని చెట్లపై సంచరిస్తూ ఉండే వీటిని పసరిక పాములు అని లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం. తాజాగా ఈ పాము కాకినాడ జిల్లా కోరింగ ఫారెస్ట్‌లో ఇలా చెట్టుపై ఆకుల మధ్య కలిసిపోయి కనిపించింది. ఈ జాతి మగపాములు 22.6 అంగుళాలు, ఆడ పాములు 41.1 అంగుళాలు పెరుగుతాయి. మడ అడవులకు వచ్చే పర్యాటకులకు ఈ పాము గురించి తెలుసుంటే మంచిది. పసరిక పాము అనుకుంటే ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.