దీనికి సంబంధించిన పూర్తి ప్రణాళికను పాఠశాల విద్యాశాఖ అధికారులు రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 25 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 17.5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ అల్పాహారం అందించాలంటే సంవత్సరానికి సుమారు రూ. 400 కోట్లు ఖర్చవుతుందని అంచనా. కేవలం ఆహార ఖర్చు రూ. 360 కోట్లు కాగా, వంటసామాగ్రి, గ్యాస్ పొయ్యిలు, నిర్వహణ తదితర అంశాలతో కలిపి మొత్తం ఖర్చు రూ. 400 కోట్ల వరకు చేరుతుందని లెక్క తేల్చారు. ఉదయం అల్పాహారంలో భాగంగా వారానికి మూడు రోజులు అన్నంతో పులిహోర, వెజ్ బిర్యానీ, కిచిడీ లాంటి వంటకాలు ఉంటాయి. మిగతా రెండు రోజులు ఉప్మా, రవ్వ కిచిడీ వంటివి అందించాలని అధికారులు ప్రతిపాదించారు. సగటున ఒక్క విద్యార్థి అల్పాహారానికి రోజుకు రూ. 10 ఖర్చవుతుందని అధికారులు లెక్కగట్టారు. రోజుకు సుమారు 16 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారని పరిగణనలోకి తీసుకుంటే, రోజువారీ వ్యయం రూ. 1.6 కోట్లు అవుతుంది. ప్రస్తుతం మధ్యాహ్న భోజనం వండే కార్మికులు నెలకు రూ. 3 వేలు వేతనం పొందుతున్నారు. కొత్త పథకం అమలులోకి వచ్చిన తర్వాత వారి పనిభారం పెరిగే అవకాశం ఉన్నందున, వేతనాన్ని రూ. 500 పెంచే ప్రతిపాదనను కూడా విద్యాశాఖ ప్రభుత్వం ముందుంచింది.ఈ పథకం ద్వారా విద్యార్థుల అడ్మిషన్లు, హాజరు శాతం గణనీయంగా పెరగవచ్చని అధికారులు నమ్ముతున్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు ఈ పథకం బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి ఆమోదం పొందిన వెంటనే ఈ ఉదయం అల్పాహారం పథకం 2026 జూన్ నుండి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభమవనుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సల్మాన్‌తో దిల్ రాజు బిగ్ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరో తెలుసా
ట్రైన్‌లో సీటు దొరకలేదని ఆ మహిళ ఏం చేసిందో చూడండి
బ్రతికుండగానే తన అంత్యక్రియలు చేసుకున్న వ్యక్తి.. ఆ తర్వాత
2026లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎంతో తెలుసా ??
Kolkata’s Underwater Metro: దేశంలోని తొలి అండర్ వాటర్ మెట్రోను చూశారా