ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. మెదక్, హవెలి ఘనపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగాసన్ పల్లి గ్రామం నుండి డయల్ 100కి కాల్ వచ్చింది. జ్యోతి అనే మహిళ తన ఇంటిలో ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటుందని పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు స్థానికులు. తక్షణం స్పందించిన పోలీసులు క్షణాల్లో అక్కడికి చేరుకున్నారు. మహిళ ఇంట్లో ఉరివేసుకుంటుందని గ్రహించిన పోలీసులు ఆ ఇంటి తలుపులను బద్దలుకొట్టారు. జ్యోతి అపస్మారక స్థితిలో ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే స్పందించిన పోలీసులు జ్యోతికి CPR చేసి, మహిళను మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో సీపీఆర్ చేసి ఆస్పత్రికి తరలించడంతో జ్యోతికి ప్రాణాపాయం తప్పింది. మహిళను కాపాడిన కానిస్టేబుల్స్ వరప్రసాద్, జైనంద్,రమేష్‌ను స్థానికులు అభినందించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విద్యార్ధులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
సల్మాన్‌తో దిల్ రాజు బిగ్ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరో తెలుసా
ట్రైన్‌లో సీటు దొరకలేదని ఆ మహిళ ఏం చేసిందో చూడండి
బ్రతికుండగానే తన అంత్యక్రియలు చేసుకున్న వ్యక్తి.. ఆ తర్వాత
2026లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎంతో తెలుసా ??