ప్రతి సంవత్సరం సినీరంగంలో చాలా మంది స్టార్‌డమ్‌ను సాధించడానికి కష్టపడుతున్నారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ మాత్రం కొన్ని నిమిషాలు కనిపించి.. ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యింది. గతేడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన హీరోయిన్ ఆమె. ఇంతకీ ఆమె ఎవరో మీకు తెలుసా.. ?
ఆ హీరోయిన్ మరెవరో కాదు.. యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ. 2017లో 'మామ్' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 'లైలా మజ్ను', 'బుల్బుల్' వంటి చిత్రాలలో నటించడం ద్వారా ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. గతేడాది సందీప్ రెడ్డి తెరకెక్కించిన యానిమల్ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది.
నటి త్రిప్తి తిమ్రి ఈ చిత్రంలో ఒక చిన్న పాత్ర పోషించింది. ఆమె కథానాయిక కూడా కాదు, కొన్ని సన్నివేశాల్లో మాత్రమే కనిపించింది. కానీ ఆ సినిమాతో ఆమె స్టార్ డమ్ సంపాదించుకుంది. 'యానిమల్' సినిమా తర్వాత నటి త్రిప్తి తిమ్రి చాలా సినిమాల్లో నటించింది. కానీ ఈ సినిమా ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది.
'బ్యాడ్ న్యూస్', 'భుల్ భులయ్య 3' వంటి సినిమాలు హిట్టయ్యాయి. 'బ్యాడ్ న్యూస్' సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.120 కోట్లు వసూలు చేసింది. నటి త్రిప్తి తిమ్రి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. . ఆమె తరచుగా తన ఫోటోలను ఇంటర్నెట్‌లో షేర్ చేస్తుంది.
అయితే గతేడాది కుర్రాళ్లు ఈ బ్యూటీ గురించి గూగుల్ లో తెగ సెర్చ్ చేశారట. ప్రస్తుతం ఈ అమ్మడు సందీప్ రెడ్డి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ మూవీలో నటిస్తుంది. అలాగే హిందీలో మరిన్ని ఆఫర్స్ అందుకున్నట్లు టాక్. ఓవైపు నెట్టింట గ్లామర్ ఫోటోషూట్లతో రచ్చ చేస్తుంది.