నేటి ఆధునిక జీవనశైలిలో జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండటం కష్టమే. అయితే ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండాలంటే కూరగాయలు, పండ్ల వినియోగాన్ని పెంచడం చాలా ముఖ్యం. అలాంటి ఆరోగ్యకరమైన వాటిలో బీట్‌రూట్ రసం ఒకటి. తాగడానికి రుచికరంగా ఉండే ఈ జ్యూస్‌కు ఎన్నో వ్యాధులను నయం చేసే శక్తి ఉంది. బీట్‌రూట్ తినడానికి వెనుకాడే వారు కూడా ఈ జ్యూస్‌ను సులభంగా తయారు చేసుకుని, ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
బీట్‌రూట్ జ్యూస్ యొక్క అద్భుత ప్రయోజనాలు
బీట్‌రూట్ రసం వివిధ రకాలుగా ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ముఖ్యంగా ఈ జ్యూస్ వల్ల కలిగే ప్రయోజనాలు ఇక్కడ చూడండి:
రక్తపోటు నియంత్రణ: గర్భధారణ సమయంలో అధిక రక్తపోటు ఉన్న మహిళలకు బీట్‌రూట్ రసం చాలా సహాయపడుతుంది. రోజుకు రెండుసార్లు 100 మి.లీ రసం తీసుకోవడం వల్ల తల్లికి, బిడ్డకు మంచి ఆరోగ్యం లభిస్తుంది.
గుండె – రక్త ప్రసరణ: ఈ రసం రక్త ప్రసరణ, సరఫరాకు అత్యంత మంచిది. వారం పాటు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది. క్రీడాకారులు కూడా దీనిని తీసుకోవడం ఉత్తమం.
కాలేయ శుద్ది: బీట్‌రూట్ రసం కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. కాలేయం ఓవర్‌లోడ్ అయినప్పుడు శరీరం లేదా నోటి నుండి దుర్వాసన వస్తుంది. అలాంటి వారు ఒక నెల పాటు ఈ రసాన్ని తాగడం వల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
కీళ్ల నొప్పుల ఉపశమనం: ఆర్థరైటిస్, రుమాటిజం, కీళ్ల నొప్పులతో బాధపడేవారు వారం పాటు క్రమం తప్పకుండా ఈ రసం తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
జీర్ణక్రియ సమస్యలు: దీర్ఘకాలంగా మలబద్ధకం లేదా అజీర్ణంతో బాధపడుతున్న వారికి బీట్‌రూట్ రసం చాలా మంచిది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఈ సమస్యల నుండి బయటపడవచ్చు.
రక్తహీనత, చర్మ కాంతి: బీట్‌రూట్ రసం రక్తహీనతను నయం చేయడంలో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మ కాంతి కూడా పెరుగుతుంది.
రోగనిరోధక శక్తి : ఇందులో విటమిన్ సి, జింక్, ఐరన్, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.
బీట్‌రూట్ జ్యూస్ ఎలా తయారు చేయాలి..?
- ముందుగా బీట్‌రూట్ తొక్క తీసి శుభ్రంగా కడగాలి.
- దానికి క్యారెట్ లేదా నారింజ వంటి ఇతర పండ్లను జోడించండి.
- మీకు కావాలంటే కొంచెం తేనె కలిపి మిక్సీలో మెత్తగా రుబ్బి రసం తయారు చేసుకోండి.
- తరచుగా తాగాలనుకుంటే, మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు.
ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే, మీ దైనందిన ఆహారంలో ఈ శక్తివంతమైన బీట్‌రూట్ రసాన్ని చేర్చుకోవడం చాలా మంచిది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్య రీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..