సినిమా ప్రపంచంలో స్టార్స్ వారసులు తమ తండ్రిలాగే నటులుగా పరిచయం అవుతుంటారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో చాలా మంది స్టార్ హీరోల పిల్లలు నటనవైపు అడుగులు వేస్తుంటారు. అలాగే కొందరు మాత్రం ఇప్పుడు హీరోలుగా, నటీనటులుగా కాకుండా, నిర్మాతలుగా, దర్శకులుగా, మ్యూజిక్ డైరెక్టర్స్ గా మారుతున్నారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ కుర్రాడు మాత్రం తన తండ్రిలాగా సినీరంగాన్ని కాకుండా మరో మార్గాన్ని ఎంచుకుననారు. ఇప్పుడు అతడు IAS అధికారిగా దేశానికి సేవ చేస్తున్నాడు. అతడు మరెవరో కాదు.. తమిళ హాస్యనటుడు చిన్ని జయంత్ కుమారుడు IAS అధికారి శ్రుతంజయ్ నారాయణన్. కృష్ణమూర్తి నారాయణన్ అలియాస్ చిన్ని జయంత్ తమిళ సినిమాల్లో ఫేమస్ యాక్టర్. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో కీలకపాత్రలు పోషించారు.
ఇవి కూడా చదవండి : Cinema: రిషబ్ శెట్టి కాంతారా వెనక్కు నెట్టిన సినిమా.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..
చిన్ని జయంత్ 1980లో తన కెరీర్‌ను ప్రారంభించి, హాస్య నటుడిగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నాడు. కానీ అతడి తనయుడు శ్రుతంజయ్ నారాయణన్.. సినిమా కాకుండా వేరే కెరీర్‌ను ఎంచుకున్నారు. చిన్నప్పటి నుంచి సినిమా ప్రపంచంలో పెరిగిన శ్రుతంజయ్.. ప్రజా పరిపాలన సేవ చేయాలనుకున్నాడు. అందుకే చిన్నప్పటి నుంచి చదువులపై దృష్టి పెట్టాడు. గిండి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఆ తర్వాత అశోక విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీని పొందాడు.
ఇవి కూడా చదవండి : Baby Movie: అమ్మడు నువ్వేనా ఇలా.. బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే..
తన మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత, శ్రుతంజయ్ కొంతకాలం ఒక స్టార్టప్‌లో పనిచేశాడు. కానీ ఎప్పుడూ IAS ఆఫీసర్ కావాలనుకున్నాడు. అటు ఉద్యోగం చేస్తూనే చదువు కొనసాగించాడు. 2015లో UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలో 75వ ఆల్ ఇండియా ర్యాంక్ సాధించాడు. శ్రుతంజయ్ ప్రస్తుతం తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో సబ్-కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. గతంలో, ఆయన విల్లుపురం జిల్లాలో అదనపు కలెక్టర్‌గా పనిచేశారు, గ్రామీణ ప్రాంతాల్లో అనేక అభివృద్ధి పథకాలను అమలు చేశారు.
ఇవి కూడా చదవండి : Actor: అమ్మాయిల క్రేజీ హీరో.. రియల్ లైఫ్‌లో సూపర్ స్టార్.. విమానం నడిపే ఏకైక హీరో అతడు..

Shrutanjay Narayanan New
ఇవి కూడా చదవండి : Kantara: 17 ఏళ్ల స్నేహం.. రిషబ్ శెట్టి కోసం కాంతార సినిమాలో ఇలా.. ఈ నటుడు ఎవరో తెలుసా.. ?