అయితే పట్టు తప్పి దొర్లుకుంటూ పడిపోయాడు. అలా 200 మీటర్లు జారిపడి మృతి చెందాడు. ఆ సమయంలో తోటి బృందంలోని సభ్యులు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. మృతుడిని 31 ఏళ్ల హాంగ్‌గా గుర్తించారు. రక్షణ బృందాలు అతన్ని కాపాడే ప్రయత్నం చేయగా.. అప్పటికే అతని ప్రాణం పోయింది. అతికష్టం మీద స్వాధీనం చేసుకున్న హాంగ్ మృతదేహాన్ని.. గోంగ్గా మౌంటెన్ టౌన్‌కు తరలించారు. సెల్ఫీ కోసం తన సేఫ్టీ రోప్ తీసేయడం, ఐస్ యాక్స్ లేకపోవడం, కాళ్లకు ఉన్న బూట్లు మంచు పై జారి దారుణం జరిగిందని అధికారులు తెలిపారు. హంగ్ మంచు కొండలు ఎక్కడం ఇదే తొలిసారి అని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హాంగ్‌తో పాటు వెళ్లిన బృందం ఎలాంటి అనుమతులు లేకుండానే శిఖరాన్ని అధిరోహించే ప్రయత్నం చేసిందని అధికారులు తెలిపారు. హాంగ్ ప్రొఫెషనల్ కాదని, అరుదుగా కొండలెక్కిన అనుభవం మాత్రమే అతనికి ఉందని సిచువాన్ మౌంటెనీరింగ్ అసోషియేషన్ తెలిపింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హీరోయిన్లను ఇబ్బంది పెడుతున్న లేటెస్ట్ టెక్నాలజీ..
కాసులు కురిపిస్తున్న కామెడీ జానర్
రూటు మార్చిన రౌడీ హీరో.. ఇక విజయ్ గురి దానిపైనే..
లెక్క తప్పుతున్న టాప్ బ్యానర్స్ అంచనాలు.. దీనికి కారణాలు అవేనా
స్టార్ హీరోలకు తప్పని లీకుల కష్టాలు.. ఈ సమస్యకు చర్యలు తప్పనిసరి అంటున్న మేకర్స్