Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

కార్తీక మాసం స్పెషల్.. పవిత్ర పంచారామా ఆలయాల చరిత్ర ఇదే..

15 October 2025

Gold reserves: భూమిలో అత్యధికంగా బంగారం నిల్వలు కలిగిన దేశాలు ఇవే..!అక్కడ గుట్టల కొద్దీ గోల్డ్

15 October 2025

Diwali Bonus: దీపావళి ఇచ్చే బోనస్‌లపై ట్యాక్స్‌ ఉంటుందా? పన్ను నియమాలు తెలుసుకోండి.. లేకుంటే ఇబ్బంది పడతారు!

15 October 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap Govt Land To Jsw In Vizianagaram,ఏపీలోని ఆ నాలుగు జిల్లాల దశ తిరిగింది.. ఇండస్ట్రియల్ పార్క్‌లు, బడా కంపెనీల పెట్టుబడులు – andhra pradesh government allocated lands gives incentives for reliance jsw and other companies
ఆంధ్రప్రదేశ్

Ap Govt Land To Jsw In Vizianagaram,ఏపీలోని ఆ నాలుగు జిల్లాల దశ తిరిగింది.. ఇండస్ట్రియల్ పార్క్‌లు, బడా కంపెనీల పెట్టుబడులు – andhra pradesh government allocated lands gives incentives for reliance jsw and other companies

.By .15 October 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap Govt Land To Jsw In Vizianagaram,ఏపీలోని ఆ నాలుగు జిల్లాల దశ తిరిగింది.. ఇండస్ట్రియల్ పార్క్‌లు, బడా కంపెనీల పెట్టుబడులు – andhra pradesh government allocated lands gives incentives for reliance jsw and other companies
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh Govt Lands Incentives And L:ands To Companies: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం భారీగా భూములు కేటాయించి, ప్రోత్సాహకాలు అందిస్తోంది. విజయనగరం, కర్నూలు, విశాఖపట్నం, పల్నాడు, చిత్తూరు, ఏలూరు జిల్లాల్లో మెగా ఇండస్ట్రియల్ పార్కులు, ఫుడ్ పార్కులు, డ్రోన్ తయారీ యూనిట్లు, లాజిస్టిక్స్ హబ్స్, సిమెంట్ ప్లాంట్లు, మహిళా పారిశ్రామిక వాడలు వంటివి రానున్నాయి. వీటి ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.

హైలైట్:

  • ఏపీకి భారీగా కంపెనీలు, పెట్టుబడులు
  • భూములు, ప్రోత్సాహకాలు ఇచ్చినసర్కార్
  • ఆ 4 జిల్లాల దశ తిరిగినట్లే అంటున్నారు
AP Govt Lands
ఏపీలో కంపెనీలకు భూముల కేటాయింపు(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం భూములు కేటాయించింది. వాటికి ప్రత్యేక ప్రోత్సాహకాలను కూడా ప్రకటించింది. విజయనగరం జిల్లాలో జేఎస్‌డబ్ల్యూ సంస్థ ఏర్పాటు చేయనున్న మెగా ఇండస్ట్రియల్‌ పార్క్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ పార్క్‌కు 1,166.43 ఎకరాల భూమిని కేటాయించారు. సంస్థ ఈ పార్క్‌ అభివృద్ధికి రూ.531.36 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ పార్క్‌ ద్వారా సుమారు 45 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం తాటిపూడి రిజర్వాయర్‌ నుంచి నీటి సరఫరా నిలిచిపోవడంతో, తాత్కాలికంగా మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్‌ నుంచి నీటిని తీసుకునేందుకు అవసరమైన కనెక్టివిటీ ఖర్చును ప్రభుత్వం భరించనుంది. ఏపీ ప్రైవేట్‌ పార్క్స్‌ పాలసీ కింద పలు ప్రోత్సాహకాలను కూడా ఈ సంస్థకు అందించనుంది. ఈ చర్యల ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త పరిశ్రమల ఏర్పాటుతో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుందని భావిస్తున్నారు.ఏపీఐఐసీ (APIIC) వెబ్‌సైట్‌లో పారిశ్రామిక ప్లాట్ల వివరాలను ఉంచడానికి అనుమతి లభించింది. జేఎస్‌డబ్ల్యూ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధీనంలో ఉన్న 273.74 ఎకరాలను పారిశ్రామిక యూనిట్లకు కేటాయించాలని జేఎస్‌డబ్ల్యూ ఇండస్ట్రియల్‌ పార్క్‌ లిమిటెడ్‌ (JSW Industrial Park Limited) చేసిన ప్రతిపాదనను రెవెన్యూ శాఖ పరిశీలించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ప్రతిపాదనలో భాగంగా, ఎకరాకు రూ.3 లక్షల మూలధన రాయితీ ఇవ్వబడుతుంది. నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేసిన తర్వాత ఈ చెల్లింపు జరుగుతుంది. అలాగే, నాలా ఛార్జీలు పూర్తిగా మినహాయింపు ఇవ్వబడతాయి. పార్క్‌ మౌలిక సదుపాయాలు 40 శాతం పూర్తయిన తర్వాత, పారిశ్రామిక ప్లాట్లను మార్కెటింగ్‌ చేయడానికి ఈ అనుమతి వర్తిస్తుంది.

రిలయన్స్ పెట్టుబడులు

కర్నూలు జిల్లాలో రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ రూ.808.03 కోట్ల పెట్టుబడితో ఫుడ్ పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ఫుడ్ పార్క్ ఏర్పాటుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 500 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది. మొదటి దశ పనులు 2027 ఫిబ్రవరిలో, రెండో దశ పనులు 2029 మార్చిలో పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు విధించింది. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కింద, సంస్థ స్థిర మూలధన పెట్టుబడిపై ఐదేళ్లలో రూ.298.70 కోట్లు (39.40 శాతం) రాయితీ కోరింది.

కర్నూలులో యాక్సెల్‌ ఈఎస్‌జీ డ్రోన్ల తయారీ యూనిట్‌

కర్నూలు జిల్లాలో డ్రోన్‌లు, సెన్సర్‌లు, బయోచార్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటుకు యాక్సెల్‌ ఈఎస్‌జీ (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ప్రభుత్వం 80 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ యూనిట్‌ మొదటి దశలో రూ.75 కోట్ల పెట్టుబడులు పెట్టి, 700 మందికి ఉపాధి కల్పించనుంది. ప్రభుత్వం ఎకరా రూ.లక్ష చొప్పున రాయితీ ధరకు భూమిని ఇచ్చేందుకు అనుమతించింది. మొత్తం మూడు దశల్లో రూ.300 కోట్ల పెట్టుబడులు పెట్టి, 3,000 మందికి ఉపాధి కల్పించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. యాక్సెల్‌ ఈఎస్‌జీ సంస్థ కర్నూలు జిల్లాలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన తయారీ యూనిట్‌ను స్థాపించనుంది. బయోచార్‌ అంటే వ్యవసాయ వ్యర్థాలను కాల్చి తయారు చేసే ఒక రకమైన బొగ్గు. ఇది నేల సారాన్ని పెంచడానికి, పర్యావరణాన్ని కాపాడటానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్టు మొదటి దశ పనులు 18 నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది.

విశాఖపట్నం లాజిస్టిక్స్ హబ్

విశాఖపట్నం జిల్లా పెందుర్తిలోని గుర్రంపాలెంలో అవంతి వేర్‌హౌసింగ్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ రూ.319.75 కోట్ల పెట్టుబడితో పారిశ్రామిక, లాజిస్టిక్స్‌ హబ్‌ను ఏర్పాటు చేయనుంది. దీనికోసం ప్రభుత్వం ఎకరానికి రూ.80 లక్షల రాయితీ ధరతో 20 ఎకరాల భూమిని దశలవారీగా కేటాయించింది. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలించి, ఆమోదం తెలిపింది. ఈ భూమిని పారిశ్రామిక, లాజిస్టిక్స్‌ హబ్‌ ఏర్పాటు కోసం అవంతి వేర్‌హౌసింగ్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఉపయోగించుకుంటుంది. ఈ ప్రాజెక్టు ద్వారా భారీ పెట్టుబడులు వస్తాయి.

మరికొన్ని కంపెనీలు, పెట్టుబడులు

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లె గ్రామంలో మహిళా శక్తి భవన్‌, మహిళా ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌ ఏర్పాటుకు అసోసియేషన్‌ ఆఫ్‌ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎలీప్‌) సంస్థకు 30 ఎకరాల భూమిని ఎకరం రూ.10 లక్షల చొప్పున కేటాయించారు. ఈ ప్రాజెక్టు ద్వారా రూ.36.35 కోట్ల పెట్టుబడితో 3వేల మంది మహిళలకు ఉపాధి కల్పించనున్నట్లు ఎలీప్‌ ప్రతిపాదనలు సమర్పించింది. మహిళలు స్వయం ఉపాధి పొంది, ఆర్థికంగా ఎదగడానికి ఈ ప్రాజెక్టు ఎంతగానో దోహదపడుతుందని చెబుతున్నారు.

శ్రీ సిమెంట్ లిమిటెడ్ కంపెనీ పల్నాడు జిల్లా పెదగర్లపాడు, ఇనుపరాజుపల్లె గ్రామాల్లో రూ.2,260 కోట్ల పెట్టుబడితో ఇంటిగ్రేటెడ్ సిమెంట్ ప్లాంట్ విస్తరణ ప్రాజెక్టును చేపడుతోంది. ఈ ప్రాజెక్టులో క్యాపిటివ్ సోలార్ పవర్ ప్లాంట్ కూడా ఉంటుంది. దీని ద్వారా 350 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటించింది. స్థిర మూలధన పెట్టుబడిలో 39 శాతం సబ్సిడీని పదేళ్లపాటు అందిస్తుంది. అలాగే, ఏడేళ్ల పాటు యూనిట్‌కు రూపాయి చొప్పున రూ.86.55 కోట్ల వరకు విద్యుత్ సుంకం మినహాయింపు కూడా లభిస్తుంది.

‘నాలాగే’.. పెమ్మసానిపై చంద్రబాబు ప్రశంసలు

కర్నూలు జిల్లాలో పుట్టగొడుగుల యూనిట్, ఫుడ్ పార్క్, చిత్తూరు జిల్లాలో రిఫైన్డ్ ఆయిల్స్, సోయా మిల్క్ యూనిట్, ఏలూరు జిల్లాలో క్రూడ్ పామ్ కర్నెల్ ఆయిల్ రిఫైనరీ యూనిట్లను ఏర్పాటు చేయనున్న సంస్థలకు ప్రభుత్వం ప్రోత్సాహక ప్యాకేజీలను ప్రకటించింది. ఈ పెట్టుబడుల ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఫ్రెష్‌ బౌల్‌ హార్టికల్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ రూ.33.50 కోట్ల పెట్టుబడితో పుట్టగొడుగుల తయారీ యూనిట్‌ను స్థాపించనుంది. అదే జిల్లాలో ఆర్‌సీపీఎల్‌ సంస్థ రూ.758 కోట్ల భారీ పెట్టుబడితో ఫుడ్‌ పార్క్‌ను ఏర్పాటు చేయనుంది. చిత్తూరు జిల్లాలో ఎస్‌వీఎఫ్‌ సోయా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ రూ.201.98 కోట్ల పెట్టుబడితో రిఫైన్డ్ ఆయిల్స్, సోయా మిల్క్ తయారీ యూనిట్‌ను నెలకొల్పనుంది. ఏలూరు జిల్లాలో గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌ సంస్థ రూ.208.77 కోట్ల పెట్టుబడితో క్రూడ్‌ పామ్‌ కర్నెల్‌ ఆయిల్‌ రిఫైనరీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం అవసరమైన ప్రోత్సాహకాలను అందిస్తుంది.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి