Dwayne Bravo : వెస్టిండీస్ క్రికెట్ జట్టు అంటే మైదానంలో స్టైల్, మ్యూజిక్, అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనలు గుర్తుకొస్తాయి. ఆ జాబితాలో డ్వేన్ బ్రావో పేరు తప్పకుండా ఉంటుంది. డీజే బ్రావోగా కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న బ్రావో.. క్రికెట్‌తో పాటు తన పర్సనల్ లైఫ్ పరంగా కూడా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
మైదానంలో ప్రశాంతంగా కనిపించే బ్రావో వ్యక్తిగత జీవితంలో మాత్రం రొమాన్స్, గ్లామర్‌కు కొదవలేదు. భారత క్రికెటర్ దీపక్ చాహర్ ఒక టీవీ షోలో మాట్లాడుతూ.. డ్వేన్ బ్రావోకు వివాహం కాకుండానే ముగ్గురు పిల్లలు ఉన్నారని సరదాగా వెల్లడించారు. “బ్రావో ప్రతి సంవత్సరం ఐపీఎల్‌కు కొత్త గర్ల్‌ఫ్రెండ్‌ను తీసుకొస్తారు. ఇది బహుశా వెస్టిండీస్ సంస్కృతిలో భాగమై ఉండొచ్చు” అని చాహర్ చమత్కరించారు. బ్రావో పేరు అనేక మంది అందమైన మోడల్స్, ప్రముఖులతో వైరల్ అవుతూ ఉంటుంది. వారిలో బార్బడోస్ మోడల్ రెజీనా రామ్‌జిత్, ఖితా గొన్జాల్వీస్ పార్టనర్ షిప్ అత్యంత చర్చనీయాంశమైంది.
ఖితా గొన్జాల్వీస్ బ్రావో ప్రస్తుత భాగస్వామి మాత్రమే కాదు, ఆమె ఒక ప్రొఫెషనల్ చెఫ్ కూడా. ఫ్రాన్స్, ఇటలీ, అమెరికా వంటి దేశాల నుంచి ఆమె చెఫ్ ట్రైనింగ్ తీసుకున్నారు. ప్రస్తుతం ఖితా తన కుమారుడితో పాటు బ్రావోతో కలిసి ట్రినిడాడ్‌లో నివసిస్తున్నారు. ఆమె తరచుగా బ్రావోను క్రికెట్ స్టేడియంలో ప్రోత్సహిస్తూ కనిపిస్తారు. సోషల్ మీడియాలో కూడా చాలా చురుకుగా ఉంటారు. తన స్టైల్, అందంతో ఆమె కరేబియన్‌లోని అత్యంత గ్లామరస్ పర్సనాలిటీలలో ఒకరిగా గుర్తింపు పొందారు. బ్రావోకు ఉన్న ముగ్గురు పిల్లలు వేర్వేరు సంబంధాల ద్వారా జన్మించినప్పటికీ, బ్రావో వారందరితో మంచి అనుబంధాన్ని కొనసాగిస్తూ, బాధ్యతాయుతమైన తండ్రిగా ఉంటున్నారు.
మైదానంలో బ్రావో రికార్డులు
వ్యక్తిగత జీవితంలో ఎంత గ్లామర్ ఉన్నా, క్రికెట్ మైదానంలో బ్రావో రికార్డుల రారాజు. వెస్టిండీస్ జట్టుకు మూడు ఫార్మాట్‌లలో అద్భుత ప్రదర్శన చేశారు.
వన్డే క్రికెట్: 164 మ్యాచ్‌లలో 2968 పరుగులు చేసి, 199 వికెట్లు తీశారు.
టెస్ట్ క్రికెట్: 40 మ్యాచ్‌లలో 2200 పరుగులు, 86 వికెట్లు.
టీ20 ఇంటర్నేషనల్: 91 మ్యాచ్‌లలో 1255 పరుగులు, 78 వికెట్లు.
ఇక ఐపీఎల్ విషయానికి వస్తే, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతూ 161 మ్యాచ్‌లలో 1560 పరుగులు చేసి, 183 వికెట్లు పడగొట్టారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..