Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

BSF Constable Jobs 2025: పదో తరగతి అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఎలాంటి రాత పరీక్ష లేదు

15 October 2025

ఏమి తెలివి భయ్యా నీది.. పైసా చెల్లించకుండా ఖరీదైన ఆహారం తింటూ రెండు ఏళ్ళు మోసం..

15 October 2025

Uppada Fishermen Compensation,మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్.. వారికి రూ. 72 లక్షల పరిహారం విడుదల.. – pawan kalyan released rs 72 lakh compensation for uppada fishermen

15 October 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap Eco Tourism Project,ఏపీలో భారీ పర్యాటక ప్రాజెక్టు.. పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు.. దేశంలోనే ఫస్ట్! – andhra pradesh government plans for big eco tourism project says deputy cm pawan kalyan
ఆంధ్రప్రదేశ్

Ap Eco Tourism Project,ఏపీలో భారీ పర్యాటక ప్రాజెక్టు.. పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు.. దేశంలోనే ఫస్ట్! – andhra pradesh government plans for big eco tourism project says deputy cm pawan kalyan

.By .15 October 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap Eco Tourism Project,ఏపీలో భారీ పర్యాటక ప్రాజెక్టు.. పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు.. దేశంలోనే ఫస్ట్! – andhra pradesh government plans for big eco tourism project says deputy cm pawan kalyan
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భారీ పర్యాటక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. సోంపేట, తవిటి మండలాల్లోని మూడు ప్రధాన చిత్తడి నేలలను అనుసంధానిస్తూ.. పర్యాటక కారిడార్‌ను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. మొత్తంగా రాష్ట్రంలో 16 చిత్తడి నేలలను గుర్తించినట్లు పేర్కొన్నారు. కొల్లేరు సరస్సు మేనేజ్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసినట్లు తెలిపారు. జీవవైధ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడే చిత్తడి నేలల సంరక్షణకు రాష్ట్రం ప్రభుత్వం నడుం బిగించడం సానుకూలాంశం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

హైలైట్:

  • ఆంధ్రప్రదేశ్‌లో భారీ పర్యాటక ప్రాజెక్టు
  • మూడు చిత్తడి నేలల అనుసంధానం
  • కొల్లేరు సరస్సు మేనేజ్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు
Andhra pradesh big Eco Tourism project
ఏపీలో భారీ పర్యాటక ప్రాజెక్టు..(ఫోటోలు– Samayam Telugu)
జీవవైవిధ్యం, పర్యావరణ పరిరక్షణకు, తీరప్రాంతాన్ని రక్షించడానికి చిత్తడి నేలలు చాలా ముఖ్యం. ఇవి సహజ కార్బన్ నిల్వలుగా ఉపయోగపడతాయి. చేపలు, పక్షులు వంటి అనేక రకాల జంతువులకు ఆవాసాలుగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి చిత్తడి నేలలు చాలానే ఉన్నాయి. కాగా, రాష్ట్రంలోని 3 ప్రధాన చిత్తడి నేలలను అనుసంధానిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ పర్యాటక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. సోంపేట, తవిటి మండలాల్లో వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న.. మూడు చిత్తడి నేలలను అనుసంధానిస్తూ భారీ పర్యాటక ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వెట్‌ల్యాండ్‌ అథారిటీ నిర్వహించిన సమావేశానికి పవన్ కళ్యాణ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 16 చిత్తడి నేలలను గుర్తించి.. వాటి పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అయితే దక్షిణాదిన ఇంత పెద్ద మొత్తంలో చిత్తడి నేలలను గుర్తించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే అని చెప్పారు. ఈ సందర్భంగా కొల్లేరు సరస్సు మేనేజ్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు కోసం కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. కొల్లేరు సరస్సు లాగా మరిన్ని చిత్తడి నేలలకు రాంసర్‌ తరహా గుర్తింపు దక్కేలా.. అటవీ శాఖ వన్యప్రాణి విభాగం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కాగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పర్యాటకం పెంచడంపై దృష్టి సారించిన విషయం తెలిసిందే.

ఆ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్..

చిత్తడి నేలల గుర్తింపు, అభివృద్ధి ప్రక్రియలో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ ముందుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. రాష్ట్ర పరిధిలో ఉన్న 16 చిత్తడి నేలలకు టెక్నికల్, గ్రీవెన్స్‌ కమిటీ ఆమోదం ఒకేసారి లభించిందని చెప్పారు. చిత్తడి నేలలను అధికారికంగా గుర్తిస్తూ నోటిఫై చేయబోతున్నామని ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ మేరకు 2018లో సోంపేట ప్రాంతంలో చిత్తడి నేలలను పరిశీలించినట్లు పవన్ గుర్తుచేశారు. సోంపేట, తవిటి మండలాల్లో 5 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న పెద్ద బీల, చిన బీల, తుంపర వంటి చిత్తడి నేలలను ఒక కారిడార్‌గా అభివృద్ధి చేస్తామని చెప్పారు.

ఈ సందర్భంగా చిత్తడి నేలలను ఎందుకు గుర్తిస్తున్నారో తెలిపారు పవన్ కళ్యాణ్. “భవిష్యత్తు అవసరాలు, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని.. రాష్ట్రంలో పెద్ద ఎత్తున చిత్తడి నేలలను గుర్తింపు ప్రక్రియ చేపట్టాం. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలి. రాష్ట్రంలో మొత్తం 23,450 చిత్తడి నేలలు ఉన్నాయి. అందులో 99.3 శాతం నేలలకు ఇప్పటికే భౌగోళిక సరిహద్దులు గుర్తించారు. అటవీ, రెవన్యూ శాఖలు సమన్వయంతో నిర్ణీత గడువులోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలి” అని పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలు జారీ చేశారు. అనంతపురం జిల్లా పరిధిలోని వీరాపురం, రాజమహేంద్రవరం సమీపంలోని పుణ్యక్షేత్రం చిత్తడినేలలు అరుదైన పక్షులకు ఆవాసంగా ఉన్నాయని తెలిపిన ఉప ముఖ్యమంత్రి.. ఈ ప్రాంతాల్లో ప్రత్యేక పక్షుల రక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

భూపతి రాజు

రచయిత గురించిభూపతి రాజుభూపతి రాజు సమయం తెలుగులో కాపీ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ట్రెండింగ్ సహా వివిధ అంశాలపై ప్రత్యేక కథనాలు రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయం, అంతర్జాతీయం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు, విశ్లేషణలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 3 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ETV భారత్ సంస్థలో జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్, స్పోర్ట్స్, సినిమా న్యూస్ రాశారు. లోక్‌సభ ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. భూపతి రాజు ఈనాడు జర్నలిజం స్కూల్‌ (EJS) నుంచి జర్నలిజంలో పీజీ డిప్లొమా పూర్తి చేశారు.… ఇంకా చదవండి