దీపిక పదుకొనే 8 గంటల పని విధానంపై కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆమె క్యోంకీ సాస్ భీ కభీ బహూ థీ 2 టీవీ సీరియల్ లో నటిస్తున్నారు. దాదాపు 20 ఏళ్ళ తర్వాత మళ్లీ స్మృతి నటిస్తున్న సీరియల్ ఇది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె దీపిక ప్రతిపాదించిన 8 గంటల పనిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇది పూర్తిగా దీపిక పదుకొనే వ్యక్తిగత విషయం. కానీ నటులు నిర్మాతల బాగోగులు కూడా చూసుకోవాలి. కొన్ని వివాదాలు కేవలం సంచలనం కోసం సృష్టిస్తారు. అటువంటి విషయాలలో పాల్గొనేంత అమాయకురాలిని కాదు నేను. కానీ నిర్మాతలను చూసుకోవాలి, వాళ్లకు నష్టం రాకుండా చూసుకోవడం నటులుగా మా బాధ్యత. ఈ రోజు పని చేయాలని నాకు అనిపించడం లేదని చెప్పడం వృత్తిపరంగా ఆమోదయోగ్యం కాదు.. సీరియల్స్ చేస్తున్నపుడే రెండుసార్లు నేను గర్భం దాల్చాను.. అప్పుడు కూడా పని చేసాను. ఒక్క రోజు మనం రాకపోతే 120 మందికి ఆ రోజు చెక్కు అందదు. అది 120 కుటుంబాలకు అన్యాయం అవుతుంది. నటిగా ఉండటం, రాజకీయాల్లో ఉండటం, తల్లిగా ఉండటం అనేవి నా ఛాయిస్.. దానిపై బాధ్యత నాదే.. అదే సమయంలో నటులుగా మనం చేసే పనిపై నిబద్ధత కూడా ఉండాలి’ అంటూ ఇన్ డైరెక్టుగా దీపిక కు కౌంటర్ ఇచ్చారు స్మృతి.
ఇటీవలే తల్లిగా ప్రమోషన్ పొందిన దీపికా పదుకొణె తరచూ వార్తల్లో నిలుస్తోంది. ప్రభాస్ స్పిరిట్, కల్కి 2 ప్రాజెక్స్ నుంచి ఆమె తప్పుకోవడం సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు సరైన కారణాలేంటో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం పలు రూమర్లు హల్ చల్ చేస్తున్నాయి. దీపికా కేవలం 8 గంటలు మాత్రమే పనిచేస్తానని చెప్పడం.. అలాగే అధికంగా రెమ్యునరేషన్ అడిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే దర్శక నిర్మాతలు దీపికను తమ ప్రాజెక్టుల నుంచి తప్పించారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో సినీ ప్రముఖుల నుంచి భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. కొందరు దీపిక కు మద్దతుగా మాట్లాడుతుంటే మరికొందరు మాత్రం ఆమెను విభేదిస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ కూడా 8 గంటల పని విధానంపై స్పందించారు.
ఇవి కూడా చదవండి
స్మృతి ఇరానీ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.