Annamayya District Police Drone,పొదల్లోకి ఎగిరిన డ్రోన్.. అందరూ అడ్డంగా దొరికిపోయారు.. పరుగో, పరుగు – police use drone to bust illegal cockfights in andhra pradesh forest
అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు.. వాల్మీకిపురం పోలీస్ స్టేషన్ దండుబోయనపల్లి పంచాయితీ పరిధిలోని మేకలవారిపల్లి గ్రామ అటవీ ప్రాంతంలో అక్రమ కోడిపందాలపై డ్రోన్ సాయంతో పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. పోలీసుల డ్రోన్ చూడగానే పందెం రాయుళ్లు పరుగులు తీశారు. అయినా విడిచిపెట్టకుండా డ్రోన్ ఫాలో చేసింది. కోడి పందెం నిర్వహిస్తున్న 15 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పందేల కోసం ఉపయోగించిన 18 ద్విచక్ర వాహనాలు, రూ.24వేల 200లు స్వాధీనం చేసుకున్నారు.