అనసూయ భరధ్వాజ్.. ఈ పేరు రెగ్యులర్‌గా వార్తల్లో వినిపిస్తూనే ఉంటుంది. ఈ అందాల భామకు ఉన్న క్రేజ్ గురించి, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గకుండా ఈ ముద్దుగుమ్మ ఫ్యాన్ బేస్ ఉంది. యాంకర్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న అనసూయ. ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంది. జబర్దస్త్ ద్వారా అనసూయ బాగా పాపులర్ అయ్యింది. ఈ కామెడీ షోలో తన యాంకరింగ్‌తో పాటు అందాలతోనూ ఆకట్టుకుంది ఈ చిన్నది. ఇక సినిమాల్లోనూ కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తుంది ఈ బ్యూటీ. అలాగే పలు టీవీ షోలతోనూ బిజీగా ఉంది అనసూయ.
ఇదెక్కడి మూవీ రా బాబు..! సినిమా మొత్తం ఆ సీన్లే.. దెబ్బకు థియేటర్స్‌లో బ్యాన్.. ఓటీటీలో మాత్రం
ఇక సోషల్ మీడియాలోనూ అనసూయ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన గ్లామరస్ ఫొటోలతో పాటు తనపై ట్రోల్ చేసే వారికి కౌంటర్లు ఇస్తూ ఉంటుంది. గతంలో అనసూయ చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ గా మారింది. అనసూయ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన అభిమాన హీరో గురించి మాట్లాడింది. అలాగే తన లవ్ రిలేషన్ గురించి కూడా చెప్పింది.
ఇవి కూడా చదవండి
తస్సాదియ్యా.. ఇది కదా మార్పు అంటే..! 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ లో నటించిన ఈ చిన్నది ఎంత
తన జీవితంలో ప్రేమ గురించి మాట్లాడుతూ.. తన లైఫ్ లో ఒకే ఒక్క బాయ్ ఫెండ్ ఉన్నాడు అతన్నే నేను పెళ్లి చేసుకున్నా అని తెలిపింది అనసూయ. ఒక వేళ పెళ్ళికాకుండా ఉంటే ఏ హీరోతో డేటింగ్ చేస్తారు అని అడగ్గన్నే ఏమాత్రం తడబడకుండా రామ్ చరణ్ పేరు చెప్పేసింది. తనకు చరణ్ అంటే చాలా ఇష్టమని.. ఒకవేళ పెళ్లి కాకుండా ఉంటే చరణ్ తో డేటింగ్ చేస్తా అని అనసూయ తెలిపారు. రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో అనసూయ రంగమ్మత్తగా నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు చరణ్ గురించి అనసూయ చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ గా మారాయి.