
ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు పెరగడం లక్షలాది మందిని ఆందోళనకు గురిచేస్తున్న అంశం.. భారతదేశంలో బంగారం ధరలతో సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఏడుపు మాత్రమే మిగిలింది. మనదేశంలో బంగారం మన సంస్కృతికి, కుటుంబ హోదాకు సంబంధించినదిగా పరిగణిస్తారు.. అలాంటి బంగారం గురించి ఇప్పుడు చాలా మంది ఆలోచించలేని స్థితికి చేరుకున్నారు. ఆ మేరకు బంగారం ధర గరిష్ట స్థాయికి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు గ్రాముకు పదమూడు వేల రూపాయలకు చేరింది. తులం బంగారు నగలు కొనాలంటే దాదాపుగా అన్ని ఖర్చులు పోనూ రెండు లక్షల వరకు అవుతుంది. దీంతో వివాహ కార్యక్రమాలకు బంగారం కొనుగోలు చేసే వారు పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.
ఈ భూమిలో అత్యధికంగా బంగారం నిల్వలు ఉన్న దేశాల జాబిత ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియాలో భూమిలో బంగారం 12,000 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి.
ఆ తరువాత స్థానం రష్యాది. రష్యా దేశంలో 12,000 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. దక్షిణాఫ్రికా లోనూ అత్యధిక బంగారం నిల్వలు ఉన్నాయి. రష్యా దేశంలో 3,200 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. ఒకప్పుడు బంగారం విషయంలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండేది. సుమారుగా 3,000 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి