గేర్ బాక్స్‌లో ఏదైనా ఇబ్బంది వస్తే చాలా ఖర్చు పెట్టి రిపేర్ చేయించాల్సి వస్తుంది. అయితే కొన్నిసార్లు గేర్ ఆయిల్ తక్కువగా ఉండడం వల్ల లేదా నాసిరకం గేర్ ఆయిల్ వాడడం వల్ల అలాగే క్లచర్ సిస్టమ్‌లో లోపాలు ఉన్నప్పుడు కూడా గేర్ బాక్స్ విసిగిస్తుంటుంది. దీనికై పెద్ద పెద్ద రిపేర్లు అవసరం లేదు. కొన్ని బేసిక్ టెక్నిక్స్‌తో కారు గేర్ బాక్స్ ను రీసెట్ చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
గేర్ ఆయిల్ చెక్
మీ బండిలో గేర్లు సరిగ్గా పనిచేయకపోతే, ముందుగా గేర్ ఆయిల్‌ను చెక్ చేయాలి. ఆయిల్ లెవల్ తక్కువగా ఉందా? లేదా చెడిపోయిందా? అన్నది చెక్ చేసుకోవాలి. ఆయిల్ రంగు ముదురుగా మారితే వెంటనే దాన్ని మార్చాల్సి రావచ్చు. మంచి ఆయిల్ తో రీప్లేస్ చేస్తే గేర్‌బాక్స్ మళ్లీ కండిషన్ లోకి వస్తుంది.
రివర్స్ గేర్ సమస్య
చాలా కార్లలో రివర్స్ గేర్ వేయడం కాస్త కష్టంగా ఉంటుంది. గేరు మార్చేటప్పుడు పెద్ద శబ్దం వస్తుంది. లేదా మరింత బలంగా రివర్స్ గేర్ వేయాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు క్లచ్ స్మూత్ గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. క్లచ్ ను న్యూట్రల్ గా ఉంచి స్లోగా గేర్ మార్చే ప్రయత్నం చేయాలి. బలవంతంగా గేర్లు మార్చడం వల్ల గేర్ బాక్స్ త్వరగా పాడైపోతుంది.
ఇవి ముఖ్యం
- మీ గేర్ బాక్స్ ఎప్పుడూ సేఫ్ అండ్ స్మూత్ గా ఉండాలంటే తరచూ గేర్ ఆయిల్ ను చెక్ చేస్తుండాలి.
- కారు గేర్లు స్మూత్ గా పడాలంటే కారులోని క్లచ్ సిస్టమ్ కూడా బాగుండాలి. కాబట్టి క్లచ్ వైర్లు, క్లచ్ మూవ్ మెంట్ ను మీకు అనుకూలంగా సెట్ చేసుకోండి.
- ఆయిల్, క్లచ్ బాగానే ఉన్నప్పటికీ గేర్ బాక్స్ లో సమస్య ఉంటే అప్పుడు నిపుణుడైన మెకానిక్‌తో బండిని చెక్ చేయించండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి