Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Couple’s Airborne Pre-Wedding Shoot Video Goes Viral

15 October 2025

Tollywood : 16 ఏళ్లకే టాప్ హీరోయిన్.. ఇండస్ట్రీలో చక్రం తిప్పి.. 19 ఏళ్ల వయసులో మరణం..

15 October 2025

యువర్ అటెన్షన్ ప్లీజ్.. హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేయండి.. కొత్త జంటలకు రైల్వే గుడ్ న్యూస్

15 October 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Uppada Fishermen Compensation,మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్.. వారికి రూ. 72 లక్షల పరిహారం విడుదల.. – pawan kalyan released rs 72 lakh compensation for uppada fishermen
ఆంధ్రప్రదేశ్

Uppada Fishermen Compensation,మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్.. వారికి రూ. 72 లక్షల పరిహారం విడుదల.. – pawan kalyan released rs 72 lakh compensation for uppada fishermen

.By .15 October 2025No Comments1 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Uppada Fishermen Compensation,మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్.. వారికి రూ. 72 లక్షల పరిహారం విడుదల.. – pawan kalyan released rs 72 lakh compensation for uppada fishermen
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఉప్పాడ హార్బర్ నిర్మాణ పనుల వల్ల మత్స్యకారుల బోట్లు దెబ్బతిన్నాయి. ఇటీవల పవన్ ఉప్పాడ ప్రాతంలో పర్యటించారు. ఈ మేరకు తన సమస్యలను మత్స్యకారులు ఉపముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తాము నష్టపోయామని.. తమకు పరిహారం రాలేదని చెప్పారు. దీంతో ప్రభుత్వం అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు.. మత్స్యకారులకు తాజాగా రూ. 72 లక్షల పరిహారం విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

హైలైట్:

  • మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్..
  • బోటు ప్రమాదాల బాధితులకు పరిహారం విడుదల
  • రూ. 72 లక్షలు విడుదల చేసిన ప్రభుత్వం
Uppada Fishermen compensation
మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్..(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట నిలబెట్టుకున్నారు. కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలంలోని బోటు ప్రమాదాల కారణంగా మత్స్యకారులు నష్టపోయిన సంగతి తెలిసిందే. అయితే బాధితులకు కూటమి ప్రభుత్వం భరోసా కల్పించింది. హార్బర్ నిర్మాణ పనుల వల్ల జరిగిన ప్రమాదాల్లో దెబ్బతిన్న బోట్లుకు పరిహారం విడుదల చేసింది. రూ. 72 లక్షలు విడుదల చేస్తూ మౌలికసదుపాయాలు, పెట్టుబడుల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.గత ప్రభుత్వంలో హయాంలో 2023లో హార్బర్‌ నిర్మాణంలో భాగంగా సముద్రంలోకి రాళ్లగట్టు వేశారు. దాంతో అక్కడ సముద్ర కెరటాల ఉద్ధృతికి బోట్లు బోల్తా పడడం, రాళ్లగట్టుని ఢీకొట్టాయి. అలా 2023 నుంచి ఇప్పటి వరకు మొత్తం 26 ప్రమాదాలు చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే బాధితులకు పరిహారం విడుదల చేసి ఉపశమనం కలిగించింది ప్రభుత్వం.

ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడలో పర్యటించారు. ఈ సందర్భంగా ఉప్పాడ హార్బర్ డిజైన్ లోపం కారణంగా తమ బోట్లు దెబ్బ తిన్నాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. బోటు ప్రమాదంలో నష్టపోతే ప్రభుత్వం నుంచి పరిహారం అందడం లేదని.. పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. హెలికాప్టర్‌లో హార్బర్ నిర్మాణ ప్రదేశాన్ని పరిశీలించిన పవన్ కళ్యాణ్.. బోట్లు నష్టపోయిన మత్స్యకారులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. తాజాగా పవన్ కళ్యాణ్ చొరవతో ఉప్పాడ హార్బర్‌లో దెబ్బ తిన్న మత్స్యకారుల బోట్లకు రూ. 72 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం విడుదల చేసిందని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. అయితే ఈ పర్యనటలో భాగంగా ఉప్పాడ కాలుష్యంపై 100 రోజుల్లో నివేదిక ఇవ్వాలని పవన్ ఆదేశించారు.

దాదాపు రూ. 360 కోట్లతో ఉప్పాడ ఫిషింగ్ హార్బర్‌ పనులు చేపట్టారు. దాదాపు 58 ఎకరాల్లో దీన్ని నిర్మిస్తున్నారు. అయితే 2024 డిసెంబర్ నాటికే ఈ హార్బర్ పనులు పూర్తి కావాల్సి ఉంది. కానీ ఇంకా పూర్తి కాలేదు. ఈ హార్బర్ పూర్తైతే.. దాదాపు 2500 మత్స్యకారుల కుటుంబాలకు ఉపాధి లభిస్తుంది. ఫలితంగా ఏటా 30 వేల టన్నుల నుంచి 1.10 లక్షల టన్నులకు వరకు మత్స్య ఉత్పత్తి పెరగే అవకాశం ఉన్నట్లు గతంలో వైసీపీ ప్రభుత్వం అంచనా వేసింది. ఆ ఉత్పత్తి విలువ రూ.890 కోట్లు ఉండనున్నట్లు అంచనా ఉంది.

ఈ ఫిషింగ్ హార్బర్ ప్రాంతంలో.. భారీ బోట్లు నిలుపగలిగేలా నిర్మాణం చేస్తున్నారు. అంతేకాకుండా 20 టన్నుల కెపాసిటీ కోల్డ్ స్టోరేజీలు.. భారీ ట్యూనా చేపల ఫిష్‌ హ్యాండ్లింగ్‌ ప్యాకింగ్‌ షెడ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. పెట్రోల్‌ బంకు, జెట్టీలు, వేలం ప్రాంగణం, చేపలు ఎండబెట్టుకునే యార్డు, ప్యాకింగ్‌ షెడ్లు, మత్స్యకారులకు శిక్షణా కేంద్రం, వలలు అల్లుకునే షెడ్లు, ఐస్‌ ప్లాంట్‌ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు.

భూపతి రాజు

రచయిత గురించిభూపతి రాజుభూపతి రాజు సమయం తెలుగులో కాపీ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ట్రెండింగ్ సహా వివిధ అంశాలపై ప్రత్యేక కథనాలు రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయం, అంతర్జాతీయం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు, విశ్లేషణలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 3 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ETV భారత్ సంస్థలో జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్, స్పోర్ట్స్, సినిమా న్యూస్ రాశారు. లోక్‌సభ ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. భూపతి రాజు ఈనాడు జర్నలిజం స్కూల్‌ (EJS) నుంచి జర్నలిజంలో పీజీ డిప్లొమా పూర్తి చేశారు.… ఇంకా చదవండి