Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Video: కొత్త కెప్టెన్‌ను తొలిసారి కలిసిన ‘హిట్‌మ్యాన్’.. ఏమన్నాడో తెలుసా?

15 October 2025

ట్రంప్ అమెరికా బెలూన్ పేలింది! టాప్ 10 పాస్‌పోర్ట్ ర్యాంకింగ్స్‌లో భారత్ ఏ స్థానంలో ఉందో తెలుసా?

15 October 2025

ఈ తరానికి కూడా 150 ఏళ్ళు బ్రతికే ఛాన్స్ ఉంది.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

15 October 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»190 New Ambulances In Andhrapradesh,ఏపీ ప్రజలకు సూపర్ న్యూస్.. త్వరలో 190 కొత్త ‘108 అంబులెన్స్‌లు’ ప్రారంభం.. – the state govt is set to induct 190 new 108 ambulances
ఆంధ్రప్రదేశ్

190 New Ambulances In Andhrapradesh,ఏపీ ప్రజలకు సూపర్ న్యూస్.. త్వరలో 190 కొత్త ‘108 అంబులెన్స్‌లు’ ప్రారంభం.. – the state govt is set to induct 190 new 108 ambulances

.By .15 October 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
190 New Ambulances In Andhrapradesh,ఏపీ ప్రజలకు సూపర్ న్యూస్.. త్వరలో 190 కొత్త ‘108 అంబులెన్స్‌లు’ ప్రారంభం.. – the state govt is set to induct 190 new 108 ambulances
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


రోడ్డు ప్రమాదాలు, పాము కాట్లు వంటి అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు గోల్డెన్ అవర్ చాలా ముఖ్యం. ఇలాంటివి జరిగిన గంటలోపే ఆసుపత్రులకు తీసుకెళ్తే.. గాయాల తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది. తద్వారా బాధితులకు ప్రాణాపాయం కూడా తగ్గుతుంది. అందుకోసం అంబులెన్స్‌లు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే రాష్ట్రంలో అంబులెన్స్‌ల కొరత, పాత వాహనాల సమస్యను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో 190 కొత్త 108 వాహనాలను ప్రారంభించన్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. దీంతో రోగులకు, క్షతగాత్రులకు వేగవంతమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

హైలైట్:

  • ఏపీలో త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం
  • వెల్లడించిన ఆరోగ్య శాఖ మంత్రి సత్య ప్రసాద్
  • వేగంగా వైద్య సహాయం అందుబాటులోకి వస్తుందన్న మంత్రి
The state govt is set to induct 190 new 108 ambulances
ఏపీ ప్రజలకు సూపర్ న్యూస్.. త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు..(ఫోటోలు– Samayam Telugu)
రోడ్డు యక్సిడెంట్లు, పాము కాట్లు వంటి అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు గోల్డెన్ అవర్ అనేది చాలా కీలకం. ప్రమాదం జరిగిన గంటలోపు బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం అందిస్తే.. గాయాల తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది. గాయపడిన వ్యక్తి బతికే అవకాశాలు కూడా పెరుగుతాయి. ఈ అత్యవసర వైద్య సహాయం అందించాలంటే.. అంబులెన్స్‌లు కీలకం. అయితే రాష్ట్రంలో అంబులెన్స్‌ల కొరత ఉంది. ఉన్నవాటిలోనూ కొన్ని అంబులెన్స్‌లు తరచూ రిపేర్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో 190 కొత్త 108 వాహనాలు ప్రారంభించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ వెల్లడించారు.

గోల్డెన్ అవర్‌లోపే వైద్యం..

ఇప్పుడున్న అంబులెన్స్‌లతో పాటు కొత్తగా ప్రారంభించనున్న 190 కొత్త అంబులెన్స్‌లు.. రోగులు, క్షతగాత్రులను మరింత వేగంగా ఆస్పత్రులకు తరలించేందుకు వీలవుతుందని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వంలో నిర్వహణ సరిగా లేక.. డొక్కు, తుక్కుగా తయారై.. తరచూ రిపేర్ అవుతున్న అంబులెన్స్‌లను తొలగిస్తామని చెప్పారు. వాటి స్థానంలో కొత్త అంబులెన్స్‌లు అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. ఫలితంగా గోల్డెన్‌ అవర్‌లోనే క్షతగాత్రులు వైద్యం సహాయం పొందుతారన్నారు.త్వరలో ప్రారంంభించనున్న 190 కొత్త 108 వాహనాల్లో.. 56 అడ్వాన్స్‌డ్‌ లైఫ్‌ సపోర్ట్, 136 బేసిక్‌ లైఫ్‌ సపోర్ట్‌ అంబులెన్సులు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 650 అంబులెన్స్‌లు నడుస్తున్నాయని.. పాత వాటిని తొలగించి.. కొత్త వాటితో కలిపితే.. వాహనాల సంఖ్య 731కు చేరుకుంటుందని మంత్రి వివరించారు. గత ప్రభుత్వంలో నీలం, ఆకుపచ్చ రంగుల్లో అంబులెన్స్‌లు ఉండేవని చెప్పిన సత్య కుమార్.. కొత్త అంబులెన్స్‌లు నేషనల్ అంబులెన్స్‌ కోడ్‌ (NAC) ప్రకారం తెలుగు, ఎరుపు రంగుల్లో ఉంటాయని వెల్లడించారు. గత నెలలోనే ప్రభుత్వం ఈ మేరకు పాత రంగులు మార్చుతున్నట్లు తెలిపింది.

గత ప్రభుత్వం పట్టించుకోలేదు..

ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంపై సత్యకుమార్ విమర్శలు గుప్పించారు. జగన్ సర్కార్ 108 అంబులెన్స్‌లను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. అంబులెన్స్‌ల నిర్వహణను పట్టించుకోలేదని.. వాల కాలం చెల్లిన అంబులెన్స్‌లను ఉపయోగించిందని అన్నారు. ఫలితంగా ప్రమాద బాధితులను ఆసుపత్రులకు తరలించడంలో జాప్యం జరిగిందన్నారు. 108 అంబులెన్స్‌ల ప్రతిస్పందన సమయం పెరిగిందని మంత్రి ఆరోపించారు.

2023 జులైలో తరచూ మరమ్మతులకు గురవుతున్న పాత అంబులెన్స్‌ల స్థానంలో అప్పటి ప్రభుత్వం 146 కొత్త 108 అంబులెన్స్‌లను ప్రారంభించింది. వీటి కోసం రూ. 34.79 కోట్లను ఖర్చు చేసింది. ఈ సందర్భంగా 2020లో 412 కొత్త అంబులెన్స్‌లను తీసుకొచ్చినట్లు వైఎస్ జగన్ తెలిపారు.

భూపతి రాజు

రచయిత గురించిభూపతి రాజుభూపతి రాజు సమయం తెలుగులో కాపీ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ట్రెండింగ్ సహా వివిధ అంశాలపై ప్రత్యేక కథనాలు రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయం, అంతర్జాతీయం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు, విశ్లేషణలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 3 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ETV భారత్ సంస్థలో జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్, స్పోర్ట్స్, సినిమా న్యూస్ రాశారు. లోక్‌సభ ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. భూపతి రాజు ఈనాడు జర్నలిజం స్కూల్‌ (EJS) నుంచి జర్నలిజంలో పీజీ డిప్లొమా పూర్తి చేశారు.… ఇంకా చదవండి