సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుత స్టార్స్ గా వెలుగొందుతోన్న వారు గతంలో చిన్న చిన్న పనులు చేసిన వారే. పొట్ట కూటి కోసం ఏవేవో ఉద్యోగాలు చేసిన వారే. ఈ సూపర్ స్టార్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతాడు. ఇతను ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి పెరిగాడు. తండ్రి ఓ సాధారణ కానిస్టేబుల్. కానీ ఈ నటుడు ఇంకా చిన్నతనంలో ఉండగానే ఆయన క్యాన్సర్ తో కన్నుమూశాడు. దీంతో చిన్న తనంలోనే కుటుంబ భారాన్ని భుజాలకెత్తుకోవాల్సి వచ్చింది. అలాగనీ చదువును నిర్లక్ష్యం చేయలేదు. పుట్టిన ఊరులోనే పాఠశాల విద్యను పూర్తి చేశాడు. ఆ తర్వాత కమర్షియల్ ఆర్ట్స్, కంప్యూటర్స్ కూడ చదివాడు. అదే సమయంలో నటనపై ఆసక్తి ఉండడంతో తన కలలను నెరవేర్చుకోవడానికి ముంబైకి బయలుదేరాడు.అలా రూ.1200 తో ముంబై మహా నగరంలోకి అడుగు పెట్టిన అతను ఇప్పుడు సూపర్ స్టార్ గా మారిపోయాడు. తన ప్రతిభతో ఏకంగా 300 కోట్లకు యజమాని అయ్యాడు. అతను మరెవరో కాదు బాలీవుడ్ కామెడీ కింగ్, హోస్ట్, నటుడు కపిల్ శర్మ.
ఇవి కూడా చదవండి
కాగా ఎన్నో ఆశలతో ముంబైకు వచ్చిన కపిల్ కు మొదట ఎలాంటి పని దొరకలేదు. దీంతో అమృత్‌సర్‌కు తిరిగి వచ్చి ‘గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్’ కోసం ఆడిషన్ కు హాజరయ్యారు. కానీ అక్కడ కూడా అతనికి నిరాశే ఎదురైంది. దీంతో మళ్లీ ఢిల్లీకి వెళ్లి ఆడిషన్‌కు హాజరయ్యాడు. షో విజేతగా నిలిచాడు. దెబ్బకు ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. ఈ షో ద్వారా వచ్చిన డబ్బుతోనే తన సోదరి వివాహం చేశాడు కపిల్. ‘K9’ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించిన కపిల్ తన పేరుమీదగానే ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’ అనే షోను ప్రారంభించాడు. ఆ తర్వాత ‘ది కపిల్ శర్మ షో’ను స్టార్ట్ చేశాడు. హోస్ట్ గా, నిర్మాతగా సత్తా చాటిన కపిల్ 2015లో ‘కిస్ కిస్ కో ప్యార్ కరూన్’ చిత్రంలో కూడా పనిచేశాడు. అలాగే కొన్ని సినిమాల్లో హీరోగానూ యాక్ట్ చేశాడు.
మిరాయ్ యూనిట్ తో కపిల్ శర్మ..
కాగా కపిల్ మొత్తం ఆస్తులు దాదాపు రూ.330 కోట్లని తెలుస్తోంది. అంతేకాదు ఆయనకు వోల్వో XC90, మెర్సిడెస్ బెంజ్ S350 CDI వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. కపిల్ ఏటా రూ.15 కోట్ల పన్ను చెల్లిస్తారు. పంజాబ్‌లో రూ.25 కోట్ల విలువైన విలాసవంతమైన ఫామ్‌హౌస్, ముంబైలో రూ.15 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్ కూడా కపిల్ కు ఉన్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..