Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Handwashing Tips: పబ్లిక్‌ టాయిలెట్స్‌కి వెళ్లినప్పుడు మీరూ ఈ తప్పులు చేస్తున్నారా?

15 October 2025

HCA సెలక్షన్‌ కమిటీ సభ్యులపై కేసు నమోదు

15 October 2025

క్రీడాకారుల నుంచి డబ్బులు వసూలు చేశారని ఫిర్యాదు..HCA పై కేసు – Telugu News | FIR Against HCA Selection Committee Over “Money for Selection” Allegations video TV9D – Sports Videos in Telugu

15 October 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Qr Code Scanning Rule At Liquor Shops,లిక్కర్ షాపుల వద్ద కొత్త రూల్స్.. ఇవి పాటించక తప్పదు.. – ap government brings new qr code scanning rule for liquor sales at liquorshops and bars
ఆంధ్రప్రదేశ్

Qr Code Scanning Rule At Liquor Shops,లిక్కర్ షాపుల వద్ద కొత్త రూల్స్.. ఇవి పాటించక తప్పదు.. – ap government brings new qr code scanning rule for liquor sales at liquorshops and bars

.By .15 October 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Qr Code Scanning Rule At Liquor Shops,లిక్కర్ షాపుల వద్ద కొత్త రూల్స్.. ఇవి పాటించక తప్పదు.. – ap government brings new qr code scanning rule for liquor sales at liquorshops and bars
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Samayam Telugu•15 Oct 2025, 5:13 pm

ఏపీలో కల్తీ మద్యం వ్యవహారం రాజకీయంగా రచ్చకు కారణమైన సంగతి తెలిసిందే. నకిలీ మద్యం కేసు దర్యాప్తు కోసం ప్రభుత్వం సిట్ కూడా ఏర్పాటు చేసింది. కల్తీ మద్యం కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. అయితే ఈ వ్యవహారంపై అటు టీడీపీ , ఇటు వైసీపీ పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన జనార్ధన్ రావు మాజీ మంత్రి జోగి రమేష్ మీద కూడా ఆరోపణలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ వ్యవహారం ఇంత సీరియస్‌గా సాగుతున్న సమయంలోనే ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. లిక్కర్ షాపుల వద్ద మద్యం అమ్మకాలకు సంబంధించి కొత్త నిబంధనలను తీసుకువచ్చింది.

AP Liquor
లిక్కర్ షాపుల వద్ద కొత్త రూల్స్.. ఇవి పాటించక తప్పదు..(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో కల్తీ మద్యం నియంత్రణకు అనేక చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. నకిలీ మద్యాన్ని అరికట్టేందుకు లిక్కర్ షాపులు, బార్ల వద్ద అసలైన, నాణ్యమైన మద్యం విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఏపీ ఎక్సైజ్ శాఖ పలు నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఇకపై లిక్కర్ షాపుల వద్ద మద్యం బాటిళ్లను ఎలా పడితే అలా అమ్మడానికి వీల్లేదు. మద్యం బాటిల్ మీద ఉన్న క్యూఆర్ కోడి స్కాన్ చేసిన తర్వాతనే మద్యం అమ్మకాలు జరపాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఏపీ ఎక్సైజ్ శాఖ ఇప్పటికే లిక్కర్ షాపు యజమానులు, బార్ల యజమానులకు ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు ఏపీ ప్రభుత్వం యాప్ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్ పేరుతో మొబైల్ అప్లికేషన్ అందుబాటులోకి తెచ్చింది.ఈ యాప్ ద్వారా మద్యం బాటిల్ మీద ఉన్న క్యూఆర్ కోడ్‌ను తప్పనిసరిగా స్కాన్ చేయాల్సి ఉంటుంది. అలా స్కాన్ చేయగానే ఆ మద్యం ఎక్కడ తయారైంది, ఎటు నుంచి ఎటు వెళ్లిందనే వివరాలు తెలుస్తాయి. ఈ నేపథ్యంలో లిక్కర్ షాపులు. బార్ల వద్ద మద్యం బాటిల్ స్కాన్ చేయడం తప్పనిసరి. అమ్మేముందు లిక్కర్ షాపు యజమానులు మద్యం బాటిల్ స్కాన్ చేసిన తర్వాతనే విక్రయించాల్సి ఉంటుంది. అలాగే తమ వద్ద విక్రయించే మద్యం.. క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా నాణ్యమైనది, నిజమైనదని ధ్రువీకరించాం.. అంటూ బోర్డులు కూడా ఏర్పాటు చేయాలని ఏపీ ఎక్సైజ్ శాఖ నిబంధనలు విధించింది.

జోగి రమేష్ చెప్తేనే నకిలీ మద్యం తయారుచేశా: జనార్దన్‌ రావు

మరోవైపు మద్యం అమ్మకాలు జరిపే ముందు లిక్కర్ బాటిల్‌పైన సీల్, క్యాప్, హోలోగ్రామ్ వంటి అంశాలను పరిశీలించాలని నిబంధనల్లో స్పష్టం చేశారు. అలాగే ప్రతీ లిక్కర్ షాపు, బార్లలోనూ తప్పనిసరిగా ఓ రిజిస్టర్ నిర్వహించాల్సి ఉంటుంది. ఈ రిజిస్టర్‌లో ఆ రోజు అమ్మిన లిక్కర్ బ్రాండ్లు, బ్యాచ్ నంబర్లు నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే క్యూఆర్ కోడ్ ఎప్పుడు తనిఖీ చేశారు వంటి వివరాలను కూడా ఈ రిజిస్టర్‌లో నమోదు చేయాలని ఏపీ ఎక్సైజ్ శాఖ.. లిక్కర్ షాపులు, బార్ల యజమానులను ఆదేశించింది. అలాగే ఎక్సైజ్ సిబ్బంది ర్యాండం విధానంలో ప్రతిరోజూ తనిఖీలు చేయాలని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. తనిఖీ తర్వతా ఆ వివరాలను సదరు ఎక్సైజ్ అధికారి రిజిస్టర్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. మరోవైపు ప్రతి లిక్కర్ షాపు, బార్‌లోని మద్యం బాటిళ్లలో కనీసం ఐదు శాతాన్నైనా స్కాన్ చేయాలనే రూల్ విధించింది. నకిలీ మద్యం ప్రజలు పిర్యాదు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేసే పనిలో ఏపీ ప్రభుత్వం ఉంది.