మీరు సోషల్ మీడియాలో అనేక ఆహార వీడియోలను చూసి ఉంటారు. ఈ వీడియోలలో చాలా వరకు చోలే భట్రే, పరాఠాలు వంటి భారతీయ వంటకాలు తెగ ఫేమస్. అయితే, పరాఠాల విషయానికి వస్తే, అవి ఊరగాయలు, చట్నీలు లేకుండా అసంపూర్ణంగా తినే ఫుడ్. కానీ ఎవరైనా ఈ పరాఠాను ఐస్ క్రీంతో తింటే..? అవును, ఆలోచించడం వింతగా ఉంటుంది. కానీ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఒక వీడియో పరాఠాలతో ఐస్ క్రీంపై ఉన్న ప్రేమకు సాక్ష్యంగా నిలుస్తోంది. ప్రస్తుతం ఒక అమ్మాయి ఐస్ క్రీంతో పరాఠా తింటున్న వీడియో వైరల్ అవుతోంది!
నిజానికి, ఒక అమ్మాయి ఊరగాయ లేదా చట్నీకి బదులుగా ఐస్ క్రీం తింటున్నట్లు కనిపించే వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. దీన్ని చూసిన తర్వాత, ఇంటర్నెట్ కారిడార్లలో భూకంపం వచ్చినంత పనైంది. ఆహార ప్రియులు ఆశ్చర్యపోయారు. ఆహారప్రియులు కొత్త విషయాన్ని తెలుసుకున్నారు. ఆ అమ్మాయి ప్లేట్‌లో ఉంచిన పరాఠా నుండి ఒక ముక్కను విరుచుకుని, ఐస్ క్రీం సండే గ్లాసు నుండి ఒక స్కూప్ తీసి, ఊరగాయ లేదా చట్నీ వేసిన విధంగానే పరాఠాపై పూయడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. దీని తర్వాత, ఆమె ఐస్ క్రీం నిండిన ముక్కను తిన్న వెంటనే, ఆహార ప్రియులకు లోపలి నుంచి ఎదో బయటకు వచ్చినంత పనైంది.
వీడియో చూడండి..
భారతీయ వీధి ఆహారంలో ఎప్పుడూ కొత్త ప్రయోగాలు జరుగుతూనే ఉంటాయి. కొందరు పార్లే-జి బిర్యానీ చేస్తుంటే, మరికొందరు తహెల్కా ఆమ్లెట్లు చేస్తున్నారు. కొందరు మటన్‌లో మద్యం కలుపుతున్నారు. మరికొందరు ఫాంటాతో మ్యాగీ లాగించేస్తున్నారు. ఇప్పుడు, పరాఠా-ఐస్ క్రీం ఈ వింత కలయిక ప్రజలను ఆశ్చర్యపరిచింది. వినియోగదారులు వీడియోపై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
ఉమ్మెకుల్సమ్ అసిమ్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసిన ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు. చాలామంది దీనిని లైక్ చేశారు. సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోపై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. “ఇవి ఐస్ క్రీంతో తింటున్న దేశీ వాఫ్ఫల్స్.” అని ఒక వినియోగదారు రాశారు. మరొకరు, “దేవుడు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించడు.” మరొకరు ఇలా రాశారు, “లేడీఫింగర్ షేక్ తయారు చేసి బియ్యం-టీ కలిసి తినడానికి ప్రయత్నించండి.” అంటూ ఉచిత సలహా ఇచ్చాడు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..