హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. అండర్-19, అండర్-23 క్రికెట్ లీగ్స్‌లో తమ పిల్లలను ఎంపిక చేయడానికి హెచ్సీఏ సెలక్షన్ కమిటీ సభ్యులు డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపిస్తూ క్రికెటర్ల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఉప్పల్ పోలీసులు హెచ్సీఏ సెలక్షన్ కమిటీ చైర్మన్ హబీబ్ అహ్మద్, సభ్యులు సందీప్ రాజన్, సందీప్ త్యాగిలపై కేసు నమోదు చేశారు. క్రికెటర్ల తల్లిదండ్రులైన డాక్టర్ రామారావు, అనంత్ రెడ్డిలు తమ కుమారులు మంచి ప్రదర్శన చేసినప్పటికీ, డబ్బులు ఇవ్వకపోవడం వల్లే సెలక్ట్ చేయలేదని ఆరోపించారు. అండర్-19, అండర్-23 లీగ్స్‌లో అవకాశం కల్పించలేదని తెలిపారు. సెలక్షన్ కమిటీపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గాయం చేసేదీ వాళ్లే! సాయం అందించేదీ వాళ్లే
దడ పుట్టిస్తున్న బంగారం ధర.. బుధవారం తులం ఎంతంటే?
వైభవ్ సూర్యవంశీకి బంపర్ ఆఫర్… ఏకంగా వైస్ కెప్టెన్సీ ఛాన్స్
ఇథనాల్ కలిపిన పెట్రోల్‌తో దెబ్బే.. సర్వేలో షాకింగ్ నిజాలు
బైకుపై రైల్వే ట్రాక్ దాటుతుండగా ప్రమాదం.. ఆ తర్వాత