Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

మీ ఇంటికి పేదరికం తీసుకొచ్చే మొక్కలు ఇవే.. వెంటనే తీసేయండి!

16 October 2025

ప్రెగ్నెన్సీ సాకు చూపి సెలవులు తీసుకుంటున్నారు.. మహిళా అధికారిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు..

16 October 2025

6,6,6,6,4,4,4,4.. భారత జట్టు ఛీ కొట్టిందని.. సిక్స్‌లు, ఫోర్లతో రెచ్చిపోయిన బ్యాడ్‌లక్ ప్లేయర్.. ఎవరంటే?

16 October 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh Green Energy Corridor Phase 3,ప్రధాని మోదీ పర్యటన వేళ ఏపీకి కేంద్రం మరో శుభవార్త.. రూ.21,800 కోట్ల ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ – central electricity regulatory commission approves proposal to set up andhra pradesh green energy corridor phase 3
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh Green Energy Corridor Phase 3,ప్రధాని మోదీ పర్యటన వేళ ఏపీకి కేంద్రం మరో శుభవార్త.. రూ.21,800 కోట్ల ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ – central electricity regulatory commission approves proposal to set up andhra pradesh green energy corridor phase 3

.By .16 October 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh Green Energy Corridor Phase 3,ప్రధాని మోదీ పర్యటన వేళ ఏపీకి కేంద్రం మరో శుభవార్త.. రూ.21,800 కోట్ల ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ – central electricity regulatory commission approves proposal to set up andhra pradesh green energy corridor phase 3
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh Green Energy Corridor 3 Approved: ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌ (జీఈసీ) ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (సీఈఆర్‌సీ) ఆమోదం తెలిపింది. అనంతపురం నుంచి రామాయపట్నం వరకు రూ.21,800 కోట్లతో భారీ విద్యుత్‌ లైన్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమలో ఉత్పత్తి అయ్యే పునరుత్పాదక విద్యుత్‌ను ఉత్తరాంధ్రకు తరలించడంతో పాటు, రాష్ట్ర విద్యుత్ పంపిణీ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఈ ప్రాజెక్టు వివరాలు ఇలా ఉన్నాయి.

హైలైట్:

  • ఏపీకి కేంద్రం నుంచి మరో తీపికబురు
  • గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌‌కు CERC ఆమోదం
  • రూ.21,800 కోట్లతో భారీ విద్యుత్‌ లైన్లు
AP Green Energy Corridor
ఏపీ గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌కు సీఈఆర్‌సీ ఆమోదం(ఫోటోలు– Samayam Telugu)
ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన వేళ కేంద్రం మరో తీపికబురు చెప్పింది. రాష్ట్రంలో గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌ (జీఈసీ) ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (సీఈఆర్‌సీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనంతపురం నుంచి నెల్లూరు జిల్లా రామాయపట్నం వరకు భారీ విద్యుత్‌ లైన్లు ఏర్పాటు చేయాలని రాష్ట్రం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. తాజాగా సీఈఆర్‌సీ రూ.21,800 కోట్లతో ఈ ప్రాజెక్టును మంజూరు చేయడానికి అనుమతించింది. ఈ కొత్త గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌ లైన్లు పూర్తయితే, రాయలసీమ ప్రాంతంలో సోలార్, విండ్ (పవన) విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను ఉత్తరాంధ్ర ప్రాంతానికి సులభంగా తరలించడానికి వీలవుతుంది. ఇది రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా, పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. కేంద్రం ఈ ప్రాజెక్టు వ్యయంలో 30 శాతం (రూ.6,540 కోట్లు) గ్రాంటు కింద ఇచ్చేందుకు ఓకే చెప్పింది. అయితే మిగిలిన రూ.15 వేల కోట్లు వ్యయాన్ని ట్రాన్స్‌కో వెచ్చించనుంది. కేంద్రం నుంచి డిసెంబరుకు ప్రాజెక్టుకు అనుమతులు వస్తాయని భావిస్తున్నారు. ఈ పననులు 2026-27లో ప్రారంభించి రెండేళ్లలో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.రాష్ట్ర ప్రభుత్వం ‘గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌-3’ కింద ఈ ప్రాజెక్టును చేపట్టాలని కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించింది. దీనికి మొత్తం రూ.28 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. అయితే, సీఈఆర్‌సీ పరిశీలించి, రూ.21,800 కోట్లతో ఈ ప్రాజెక్టును మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా సుమారు 350 కిలోమీటర్ల మేర విద్యుత్‌ పంపిణీ లైన్లను ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలో 72,000 మెగావాట్ల సోలార్, విండ్, పంప్డ్‌ స్టోరేజ్‌ విద్యుత్‌ ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం రాయలసీమలోనే ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల నుంచి వచ్చే విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానించడానికి ట్రాన్స్‌కో సొంతంగా నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ లైన్లను వాడితే భారీ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకుంది. గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌-1 కింద అనంతపురం జిల్లాలో ఇప్పటికే నెట్‌వర్క్‌ను ట్రాన్స్‌కో అభివృద్ధి చేసింది. ఇప్పుడు జీఈసీ-3 కింద కొత్త లైన్లను ఏర్పాటు చేయనుంది.

ప్రస్తుతం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌కు చెందిన లైన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ లైన్లను ఉపయోగించుకుంటే ట్రాన్స్‌కోకు అధిక మొత్తంలో ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఈ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి, ట్రాన్స్‌కో సొంతంగా విద్యుత్ లైన్ల నెట్‌వర్క్‌ను నిర్మించుకోవాలని నిర్ణయించింది. ఈ దిశగా, ‘గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌-1’ (జీఈసీ-1) పథకం కింద అనంతపురం జిల్లాలో ఇప్పటికే ట్రాన్స్‌కో చాలా వరకు నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసింది. ఇప్పుడు, ఈ పనిని కొనసాగిస్తూ, ‘గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌-3’ (జీఈసీ-3) కింద కొత్త విద్యుత్ లైన్లను ఏర్పాటు చేయడానికి ట్రాన్స్‌కో సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త లైన్లు, మరిన్ని పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల నుంచి వచ్చే విద్యుత్‌ను గ్రిడ్‌కు సులభంగా అనుసంధానించడానికి సహాయపడతాయి.

‘నేను స్టూడెంట్.. నువ్వు నా టీచర్..’ నంద గోకులం విద్యార్థులతో చంద్రబాబు సరదా ముచ్చట

ఇప్పటికే రామాయపట్నం నుంచి కాకినాడ వరకు ఉన్న ట్రాన్స్‌కో నెట్‌వర్క్‌ను, కాకినాడ నుంచి విశాఖపట్నం వరకు విస్తరిస్తున్నారు. జీఈసీ-3 కింద చేపట్టిన పనులు పూర్తయితే, ఉత్తరాంధ్ర జిల్లాలకు విద్యుత్ సరఫరా సులభతరం అవుతుంది. రాబోయే మూడేళ్లలో విశాఖపట్నంలో ప్రారంభం కానున్న భారీ ప్రాజెక్టులకు, కర్నూలు, తిరుపతి జిల్లాల్లో రానున్న పరిశ్రమలకు ఈ కొత్త నెట్‌వర్క్ ద్వారా విద్యుత్ అందించనున్నారు. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ వంటి పెద్ద ప్రాజెక్టులకు ఏటా సుమారు 6 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమవుతుందని విద్యుత్ శాఖ అంచనా వేస్తోంది. ఈ అవసరాలను తీర్చడానికి, కొత్త విద్యుత్ నెట్‌వర్క్ కీలకం కానుంది. కర్నూలు జిల్లాలో రిలయన్స్ ఫుడ్ పార్క్, డ్రోన్ సిటీ, తిరుపతి జిల్లాలో ఎలక్ట్రానిక్ కంపెనీలు కూడా ఈ కొత్త నెట్‌వర్క్‌తో అనుసంధానం కానున్నాయి. ఈ విస్తరణతో రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారుతుంది.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి