Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

స్వర్ణయుగం ప్రారంభం.. ఈ రాశుల వారికి ఆదాయం, పనిలో విజయం ఖాయం!

15 March 2026

Chandrababu On Putta Mahesh Drugs Case,Putta Mahesh Yadav: ఎంపీ పుట్టా మహేష్ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్.. కీలక ఆదేశాలు.. – cm chandrababu serious on eluru tdp mp putta mahesh kumar yadav in moinabad farmhouse drugs case

15 March 2026

25 వేల రైళ్లను ఇండియన్‌ రైల్వేస్‌ ఎలా నిర్వహిస్తోంది? మైండ్‌బ్లాంక్‌ అయ్యే విషయాలు..!

15 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Horoscope Today: వారి ఆదాయ ప్రయత్నాలు సఫలం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
తాజా వార్తలు

Horoscope Today: వారి ఆదాయ ప్రయత్నాలు సఫలం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

.By .8 January 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Horoscope Today: వారి ఆదాయ ప్రయత్నాలు సఫలం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


దిన ఫలాలు (జనవరి 8, 2026): మేష రాశి వారు పెళ్లి ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశముంది. వృషభ రాశి వారికి ఉద్యోగాల్లో ఊహించని ఆఫర్లు అందే అవకాశముంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగులకు బరువు బాధ్యతలు పెరుగుతాయి. అధికారులతో సానుకూల పరిస్థితులుంటాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ తాయి. ఇష్టమైన మిత్రులతో కాలక్షేపం చేయడం జరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి దూర ప్రాంతంలో ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో శుభ కార్యంలో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగాల్లో ఊహించని ఆఫర్లు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. కొందరు బంధువుల వల్ల మేలు జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా సా గిపోతుంది. ఆర్థిక, రుణ సంబంధమైన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. చేపట్టిన వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో శ్రమాధిక్యత ఉంటుంది. బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. బంధువులతో మాట పట్టింపులు తలెత్తే అవకాశం ఉంది. నిరుద్యోగు లకు సమయం అనుకూలంగా ఉంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా సానుకూల ఫలితాలనిస్తాయి. కొందరు మిత్రుల వ్యవహారాలు ఇబ్బంది పెడ తాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వ్యాపారంలో ఆశించిన లాభాలు కనిపిస్తాయి. ఇంటా బయటా అదనపు బాధ్యతలుంటాయి. మానసిక ఒత్తిడికి అవకాశముంది. కొద్దిగా అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం కూడా ఉంది. ఆదాయం పెరుగుతుంది కానీ, అందుకు దీటుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయపడతారు. కుటుంబంలో అన్యోన్య వాతావరణం నెలకొంటుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం చాలా మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు గడిస్తారు. ఆర్థిక విషయాలకు సమయం అనుకూలంగా ఉంది. కొత్త ప్రయత్నాలు, నిర్ణయాల వల్ల లబ్ధి పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి అనేక అవకాశాలు అందివస్తాయి. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. కొందరు ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రులకు సహాయ సహకారాలందిస్తారు. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, వ్యాపారాలలో రాబడికి లోటుండదు. ఉద్యోగంలో అధికారులు కొన్ని ప్రత్యేక బాధ్యతలతో ప్రోత్సహిస్తారు. ఆదాయానికి ఇబ్బంది ఉండదు కానీ కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. పెండింగ్ పనులు కూడా నిదానంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కొందరు బంధువుల వల్ల ఇబ్బంది పడతారు. సొంత వ్యవహారాల మీద దృష్టి పెట్టడం మంచిది. ఆరోగ్యం పరవాలేదు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో ఊహించని పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో మరింతగా పురోగతి సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో బంధుమిత్రులు సహాయపడతారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. దాదాపు ప్రతి ప్రయత్నమూ విజయవంతం అవుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు సఫలం అయ్యే సూచనలున్నాయి. ఆరోగ్యానికి ఢోకా లేదు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం, భద్రత లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. వృథా ఖర్చులకు కళ్లెం వేయడం మంచిది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. ఆహార, విహారాల్లోనే కాక, ప్రయాణాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కొందరు మిత్రులతో కాలక్షేపం చేస్తారు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాలలో మీ సలహాలు, సూచనలకు విలువ పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆదాయానికి ఏమాత్రం లోటుండదు. ఇతరులకు ఇతోధికంగా సహాయపడతారు. ముఖ్యమైన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. శుభ కార్యం తలపెడతారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. విందులు, వినోదాల మీద ఖర్చు పెరుగుతుంది. విదేశాల నుంచి శుభవార్తలు వింటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ముఖ్యమైన పనులు, వ్యవహారాలను వాయిదా వేయడం మంచిది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, రియల్ ఎస్టేట్ రంగానికి చెందినవారు, మద్య వ్యాపారులు బాగా బిజీ అయిపోతారు. కుటుంబ జీవితం హ్యాపీగా, ప్రశాంతంగా సాగిపోతుంది.

కుంభం (ధనిష‌్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితికి లోటుండదు. వ్యాపారాల్లో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. పోటీదార్ల నుంచి సవాళ్లు బాగా పెరుగుతాయి. శుభ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. పిల్లలు ఆశించిన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. కుటుంబ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు బాగా పెరుగుతాయి. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కొత్త ప్రయత్నాలు కలిసి వస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులలో ఒకరికి స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. స్తోమతకు మించి మిత్రులకు సహాయపడతారు. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

స్వర్ణయుగం ప్రారంభం.. ఈ రాశుల వారికి ఆదాయం, పనిలో విజయం ఖాయం!

15 March 2026

25 వేల రైళ్లను ఇండియన్‌ రైల్వేస్‌ ఎలా నిర్వహిస్తోంది? మైండ్‌బ్లాంక్‌ అయ్యే విషయాలు..!

15 March 2026

శని నక్షత్ర మార్పు: ఈ రాశులవారికి అంతులేని ఐశ్వర్యం, ఆనందం..! మీ రాశి ఇదేనా..?

15 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

స్వర్ణయుగం ప్రారంభం.. ఈ రాశుల వారికి ఆదాయం, పనిలో విజయం ఖాయం!

15 March 2026

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం సహజం. అయితే 2026 ఏప్రిల్ నెలలో మీన రాశిలో సూర్యుడు, కుజ గ్రహాల కలయిక…

Chandrababu On Putta Mahesh Drugs Case,Putta Mahesh Yadav: ఎంపీ పుట్టా మహేష్ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్.. కీలక ఆదేశాలు.. – cm chandrababu serious on eluru tdp mp putta mahesh kumar yadav in moinabad farmhouse drugs case

15 March 2026

25 వేల రైళ్లను ఇండియన్‌ రైల్వేస్‌ ఎలా నిర్వహిస్తోంది? మైండ్‌బ్లాంక్‌ అయ్యే విషయాలు..!

15 March 2026

Rythu Bharosa: రైతులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఆరోజే అకౌంట్లోకి రైతు భరోసా డబ్బులు

15 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

స్వర్ణయుగం ప్రారంభం.. ఈ రాశుల వారికి ఆదాయం, పనిలో విజయం ఖాయం!

15 March 2026

Chandrababu On Putta Mahesh Drugs Case,Putta Mahesh Yadav: ఎంపీ పుట్టా మహేష్ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్.. కీలక ఆదేశాలు.. – cm chandrababu serious on eluru tdp mp putta mahesh kumar yadav in moinabad farmhouse drugs case

15 March 2026

25 వేల రైళ్లను ఇండియన్‌ రైల్వేస్‌ ఎలా నిర్వహిస్తోంది? మైండ్‌బ్లాంక్‌ అయ్యే విషయాలు..!

15 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.