52 టన్నుల కలపతో 40 అడుగుల చుట్టుకొలతతో 20 అడుగుల ఎత్తు భారీ బహుబలి భోగిమంట వేశారు. గత మూడు దశాబ్దాలుగా.. పూర్వీకుల నుండి ఈ భోగి మంట ఆచారం ఆనవాయితీగా వస్తోందన్నారు నిర్వాహకులు. రాష్ట్రంలోని ఎక్కడా లేని విధంగా కోమరిపాలెం లో ప్రతి సంవత్సరం రికార్డు స్థాయిలో భోగిమంట ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే నల్లమిల్లి చేతుల మీదుగా భోగిమంటకు పండితులు పూజలు నిర్వహించారు. సంక్రాంతి అంటే సంబరం మాత్రమే కాదు. సంక్రాంతిలో సైన్స్ వుంది. అందుకు నిదర్శనమే బోగిమంటలు. ఆవుపేడతో వెలిగించే భోగి మంటలు గాలిలో ఉన్న క్రిమికీటకాలను దూరం చేస్తాయి. పనికి రాని వస్తువులను భోగిమంటల్లో వేయడం ఆనవాయితీ. అది మన మనసుల్లో వున్న మలినాలను తీసేస్తుందని నమ్మకం. ఇలా పండగంటే సంబరం మాత్రమే కాదు. ఇందులో ఎంతో పరమార్ధం దాగి ఉంది. తెలుగు లోగిళ్లలో ఆనందాల భోగి వెలుగులు విరజిమ్ముతున్నాయి.

