మాజీ సీఎం జగన్‌పై దాడి చేసిన వేముల సతీష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఈసారి పాత కేసులో కాదు, మైనర్ బాలికను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు పోక్సో కేసులో ఇరుక్కున్నాడు. ఇంట్లోంచి వెళ్లిపోయి, బాలికను పెళ్లి చేసుకున్న అతడిని పోలీసులు పట్టుకున్నారు. బాలిక మైనర్ కావడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

గతంలో మాజీ ముఖ్యమంతరి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై గులకరాయితో దాడి చేసిన కేసులో నిందితుడైన వేముల సతీష్‌కుమార్‌ని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన వేముల సతీష్‌కుమార్ గత ఏడాది జులై కనిపించకుండా పోవడం సంచలనం సృష్టించింది. జులై 17న రాత్రి ఇంట్లో పడుకున్న అతడు తర్వాత రోజు ఉదయానికి కనిపించలేదు. జగన్‌పై దాడి కేసులోస నిందితుడు కావడంతో.. అతడు కనిపించకుండా పోవడం తీవ్ర సంచలనం సృష్టించింది. దీంతో పోలీసులపై ఒత్తిడి పెరిగింది.
కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ ప్రారంభించగా.. అతడు ఓ బాలికను ప్రేమించాడని.. కానీ సతీష్ తల్లిదండ్రులు వారి పెళ్లికి అంగీకారం తెలపలేదని.. దీంతో అతడు ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు వెల్లడైంది. పైగా అతడు తన మొబైల్ ఫోన్ వెంట తీసుకెళ్లలేదు. దీంతో సతీష్ ఆచూకీ కనుగోవడం కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
ఇంట్లో నుంచి వెల్లిపోయిన సతీష్ కొన్ని రోజులకు తండ్రికి కాల్ చేసి.. వేరే వ్యక్తి యూపీఐ నంబర్‌కి రూ.1500 వేయమన్న సంగతి పోలీసులకు తెలిసింది. దీని ఆధారంగా దర్యాప్తు చేసి.. సతీష్ తిరుపతిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈక్రమంలో స్థానిక పోలీసులకు సమాచారం అందించి వారి సాయంతో నిఘా ఉంచి 10 రోజుల తరువాత అతనిని పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించారు.
తాజాగా సతీష్ బాలికను పెళ్లి చేసుకోవడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. బాలిక మైనర్ కావడంతో సతీష్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. అతడిని అరెస్ట్ చేశారు. న్యాయస్థానంలో హాజరుపర్చడంతో కోర్టు రిమాండ్ విధించింది.


