Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

SBI, ICICI, HDFC, PNB బ్యాంకుల కస్టమర్లకు బిగ్‌ అలర్ట్‌..! మారనున్న రూల్స్‌..!

31 January 2026

Tollywood : శ్రీముఖితో చేసిన సినిమా ఆగిపోయింది.. ఎందుకు రిలీజ్ చేయలేదంటే.. అసలు విషయం చెప్పిన నటుడు హర్షవర్దన్..

31 January 2026

Flatted Factory Complex In Andhra Pradesh,ఏపీలోని ఆ ప్రాంతానికి మహర్దశ.. ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సుల ఏర్పాటు.. – flatted factory complex in mylavaram and vijayawada central constituencies

31 January 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Former Minister Ambati Rambabu Arrested,అంబటి రాంబాబు అరెస్ట్.. నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తరలింపు.. – andhra pradesh former minister ambati rambabu arrested by guntur police
ఆంధ్రప్రదేశ్

Former Minister Ambati Rambabu Arrested,అంబటి రాంబాబు అరెస్ట్.. నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తరలింపు.. – andhra pradesh former minister ambati rambabu arrested by guntur police

.By .31 January 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Former Minister Ambati Rambabu Arrested,అంబటి రాంబాబు అరెస్ట్.. నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తరలింపు.. – andhra pradesh former minister ambati rambabu arrested by guntur police
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఏపీ రాజకీయాల్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్ పెద్ద దుమారం రేపింది. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో గుంటూరు పోలీసులు ఆయనను శనివారం రాత్రి అరెస్ట్ చేసి నల్లపాడు స్టేషన్‌కు తరలించారు. తనపై దాడులు జరగడం వల్లే ఆవేశంలో మాటలు దొర్లాయని ఆయన వివరణ ఇచ్చినప్పటికీ.. పోలీసులు కేసు నమోదు చేసి భారీ బందోబస్తు మధ్య అదుపులోకి తీసుకున్నారు. అంబటి అరెస్టును జగన్ తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతం అంబటి నివాసం వద్ద ఉద్రిక్తత కొనసాగుతుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

Ambati Arrested
అంబటి రాంబాబు అరెస్ట్(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శనివారం రాత్రి అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. గుంటూరులోని ఆయన నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తతల నడుమ పోలీసులు అంబటిని అదుపులోకి తీసుకుని నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అసలేం జరిగిందంటే..

తిరుమల లడ్డూ వివాదానికి సంబంధించి వైసీపీ నేతలను విమర్శిస్తూ గుంటూరులో కొన్ని ఫ్లెక్సీలు వెలిశాయి. వీటిని తొలగించాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆయన వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తుండగా కొందరు అడ్డుకున్నారని.. అప్పుడే అక్కడ దూషణలు జరిగాయని సమాచారం. తనపై టీడీపీ కార్యకర్తలు రాడ్లు, కర్రలతో దాడికి ప్రయత్నించారని అంబటి ఆరోపించారు. చంపడానికి వస్తే తాను కేకలు వేశానని.. ఆ సమయంలోనే ఆగ్రహంతో కొన్ని మాటలు అన్నానని ఆయన మీడియా ముందు అంగీకరించారు.అరెస్టుకు ముందే అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ఆదేశాల మేరకే పోలీసులు నన్ను అరెస్ట్ చేయడానికి వస్తున్నారు. నేను జైలుకు వెళ్లడానికి సిద్ధం. మీ రెడ్ బుక్కుకు నేను భయపడను’ అంటూ సవాల్ విసిరారు. రాత్రి 10:30 గంటల ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తుతో ఆయన ఇంటిని ముట్టడించారు. అంబటిని వజ్ర వాహనంలో ఎక్కించి తరలిస్తుండగా వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది.

అంబటి రాంబాబు అరెస్టును వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని.. ఇది అచ్చం ‘జంగిల్ రాజ్’ (అరాచక పాలన) లా ఉందని ఆయన విమర్శించారు. లడ్డూ వివాదంలో నిజాలు బయటపడతాయనే భయంతోనే ప్రభుత్వం ఇలాంటి దాడులకు దిగుతోందని ఆరోపించారు. ప్రశ్నించే గొంతుకలను నొక్కేయడానికే అంబటిపై హత్యాయత్నం చేయించి.. తిరిగి ఆయననే అరెస్ట్ చేశారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బాజీ చౌదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. ముఖ్యమంత్రిని ఉద్దేశించి అసభ్య పదజాలం వాడినందుకు చట్టప్రకారమే కేసు నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు. అంబటి ఇంటిపై దాడి జరిగిందన్న ఆరోపణలను విచారిస్తున్నామని.. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండటానికే ముందస్తుగా అరెస్ట్ చేశామని వివరించారు. ప్రస్తుతం అంబటి రాంబాబును నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో ఉంచి విచారణ కొనసాగిస్తున్నారు.

అంబటి రాంబాబుపై పోలీసులు రెండు వేర్వేరు ఎఫ్ఐఆర్ (FIR)లు నమోదు చేశారు. పోలీసులు సుమోటోగా ఒక కేసు నమోదు చేయగా.. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు ఇచ్చిన ఫిర్యాదుతో మరో కేసు నమోదైంది. ఈ కేసుల్లో పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) ప్రకారం 126(2), 132, 196(1), 352, 351(2), 292 వంటి సెక్షన్లను చేర్చారు. సీఎంపై అసభ్యకర పదజాలం వాడటం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించడం వంటి ఆరోపణల కింద ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఈ పరిణామం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.

బూరుగడ్డ వీరబాబు

రచయిత గురించిబూరుగడ్డ వీరబాబుబూరుగడ్డ వీరబాబు సమయం తెలుగులో కాపీ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఆయన తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, ఇన్‌ఫ్రా న్యూస్‌, పొలిటికల్ న్యూస్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి వీరబాబు జర్నలిజంలో పీజీ చేస్తున్నారు.… ఇంకా చదవండి