Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

సీనియర్ ఎన్టీఆర్‌కే షాకిచ్చిన ఆ కథతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిరంజీవి.. దెబ్బకు టాలీవుడ్ షేక్.!

12 March 2026

Shakeela: ఆ రాత్రి వేణుమాధవ్ రూమ్‌లో నిద్రపోయిన షకీలా.. ఆయన ఇలా అన్నాడట

12 March 2026

Dreams: కలలో ఈ 3 కనిపిస్తే కోటీశ్వరులు అవ్వడం గ్యారంటీ..! అదృష్టాన్ని అడ్డుకున్నా ఎవరూ ఆపలేరు..

12 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Mulapeta Port Townships Planning,ఆ జిల్లా దశ తిరిగింది.. 3 వేల ఎకరాల్లో టౌన్‌షిప్‌లు.. ఆ కొత్త పోర్టు దగ్గరే! – andhra pradesh government planned townships near mulapeta port
ఆంధ్రప్రదేశ్

Mulapeta Port Townships Planning,ఆ జిల్లా దశ తిరిగింది.. 3 వేల ఎకరాల్లో టౌన్‌షిప్‌లు.. ఆ కొత్త పోర్టు దగ్గరే! – andhra pradesh government planned townships near mulapeta port

.By .7 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Mulapeta Port Townships Planning,ఆ జిల్లా దశ తిరిగింది.. 3 వేల ఎకరాల్లో టౌన్‌షిప్‌లు.. ఆ కొత్త పోర్టు దగ్గరే! – andhra pradesh government planned townships near mulapeta port
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Srikakulam Townships Planning In 3000 Acres: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భారీ టౌన్‌షిప్‌లు ప్లాన్ చేస్తోంది. శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టుకు సమీపంలో ఏకంగా 3వేల ఎకరాల్లో నిర్మించాలని భావిస్తున్నారు. ఈ మేరకు భూమిని గుర్తించి సేకరించే పనిలో ఉన్నారు. రెండుచోట్ల ఈ టౌన్‌షిప్‌లను ప్లాన్ చేస్తున్నారు. అధికారులు టౌన్‌షిప్‌లు ప్రతిపాదించిన ఆ భూముల్ని రెండు రోజుల క్రితం వెళ్లి పరిశీలించి వచ్చారు.. త్వరలోనే దీనిపై పూర్తిగా క్లారిటీ వస్తుందని చెబుతున్నారు.

హైలైట్:

  • ఏపీ ప్రభుత్వం మరో మాస్టర్ ప్లాన్
  • మూలపేట పోర్టు దగ్గర టౌన్‌షిప్‌లు
  • 3వేల ఎకరాల్లో ప్లాన్ చేస్తున్నారు
Srikakulam Townships
3 వేల ఎకరాల్లో టౌన్‌షిప్‌లు(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పోర్టుల్ని అభివృద్ధి చేస్తోంది.. కొత్త పోర్టుల్ని కూడా తెరపైకి తీసుకొచ్చింది. కేంద్రం సహకారంతో నిధులు తీసుకొచ్చి వీటిని ప్లాన్ చేస్తున్నారు. అయితే శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు నిర్మాణం పనులు వేగవంతం చేశారు.. అక్కడే ఇండస్ట్రియల్ క్లస్టర్ కూడా ఏర్పాటు చేసేందుకు అడుగులు వేస్తున్నారు. తాజాగా టౌన్‌షిప్‌లు కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు టౌన్‌షిప్‌ల కోసం అధికారులు భూముల్ని గుర్తిస్తున్నట్లు సమాచారం. టెక్కలి దగ్గర నేషనల్ హైవే నుంచి మూలపేట పోర్టు వరకు ఉన్న లింక్ రోడ్డుకు ఇరువైపులా ఈ టౌన్‌షిప్‌లు ప్లాన్ చేస్తున్నారట. భూసేకరణ దిశగా అడుగులు పడుతున్నాయట.మూలపేట పోర్టుకు కనెక్ట్ చేసే రోడ్డు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.. ఇప్పటికే 100 వెడల్పుతో భూసేకరణ పూర్తి చేసి.. ఈ రోడ్డు పనులు కూడా కొనసాగుతున్నాయి. అయితే పోర్టుకు అనుబంధంగా పరిశ్రమలు తీసుకొచ్చే పనిలో ఉన్నారు. అయితే ఈ పరిశ్రమల కోసం టౌన్‌షిప్‌లు నిర్మించాలని ప్లాన్ చేశారు. ఈ మూలపేట పోర్టు రోడ్డుకు రెండు వైపులా స్థలాలు సేకరించనున్నారు. ఆ రోడ్డుకు దగ్గర 50 మీటర్లు గ్రీనరీ ప్లాన్ చేశారు.. ఆ తర్వాత కిలోమీటరు వరకు భూముల్ని టౌన్‌షిప్‌ల కోసం కేటాయించనున్నారు. ఈ టౌన్‌షిప్‌ల కోసం ఏకంగా 3వేల ఎకరాలు సేకరించాలని భావిస్తున్నారు. ఈ మేరకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసే పనిలో ఉన్నారు.

మూలపోర్టు సమీపంలో నౌపడాలో ప్రస్తుత ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ దగ్గర మరో టౌన్‌షిప్‌ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ మర్రిపాడు రెవెన్యూ పరిధిలో ఉయ్యాలపేట రోడ్డులో జిరాయితీ ఉప్పు భూములు ఉన్నట్లు అధికారులు గుర్తించాట. మొత్తం 485 ఎకరాల భూములు ఉన్నాయట.. వీటిని భూసమీకరణ ద్వారా తీసుకోవాలని భావిస్తున్నారట. అప్పుడు టౌన్‌షిప్‌కు ఇబ్బందులు ఉండవు అంటున్నారు.. ప్రభుత్వానికి భారం తగ్గుతుంది అంటున్నారు. అందుకే ఈ భూముల విషయంలో రైతుల్ని ఒప్పించాలని నిర్ణయించారట. జేసీ అహ్మద్ ఖాన్, టెక్కలి ఆర్డీవోలు కలిసి ఆ భూముల్ని రెండు రోజుల క్రితం పరిశీలించారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి