Ap Pmay-g Beneficiaries Rs 2.39 Lakhs,ఏపీలో పేదలకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికి రూ.2.39 లక్షలు ఇస్తారు, కీలక నిర్ణయం – ap govt decided to provide rs 2 lakhs 39000 for house construction underpradhan mantri awas yojana gramin scheme to rural poor people
AP PMAY-G Rs 2.39 Lakhs For Poor People: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.. ఏపీలో పేదలకు సాయం చేయాలని నిర్ణయించింది. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 పథకానికి సంబంధించి సాయం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఒక్కో ఇంటికి రూ.2.39 లక్షలు ఇవ్వనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా జీరామ్‌జీ, స్వచ్ఛభారత్ మిషన్ కింద ఈ మొత్తం రూ.2.39 లక్షలు అందించాలని నిర్ణయం.
హైలైట్:
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
పేదల ఇళ్లకు భారీ సాయం
రూ.2.39 లక్షలు ఇస్తారు
ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ పథకం(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు అండగా నిలబడాలని నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు శాశ్వత గృహ వసతి కల్పించేందుకు సాయం చేయాలని కేబినెట్‌లో నిర్ణయించారు. పేదల ఇంటి నిర్మాణానికి.. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సాయం చేస్తాయి. అమరావతిలో జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు ఒక్కో యూనిట్ వ్యయం రూ.2.39 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు.. దీనిలో కేంద్రం వాటా రూ.95,400గా ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాటా రూ.63,600గా నిర్ణయించారు. వీటికి అదనంగా జీరామ్‌జీ పథకం కింద రూ.27 వేలు, స్వచ్ఛభారత్ మిషన్ కింద రూ.12 వేలు కలిపి మొత్తం 2.39 లక్షలు ఇస్తారు. అయితే ఈ డబ్బులకు అదనంగా డ్వాక్రా సంఘాల మహిళలకు ఇచ్చే రుణంపై వడ్డీని కూడా ప్రభుత్వం రాయితీ చెల్లిస్తుంది. మొత్తం రూ.4,279.33 కోట్లు ఈ పథకం అమలుకు అవుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఏపీలో ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఏర్పాటుకే కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అమరావతిలో ఈ ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నారు. ప్రతి కుటుంబంలో ఒకరైనా ఏఐ శిక్షణ ఇవ్వాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు దీనికి సంబంధించి అవసరమైన ఒప్పందాలు చేసుకోనున్నారు. మరోవైపు తిరుపతిలో డిజాస్టర్ రికవరీ (డీఆర్) సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలకు కేబినెట్ ఓకే చెప్పింది. అంతర్జాతీయ ప్రమాణాలతో తిరుపతిలోని ఐఐడీటీ క్యాంపస్‌లో ఏర్పాటు చేయనున్నారు. సాస్కీ పథకం కింద ‘బూట్’ విధానంలో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. అంతేకాదు ‘అమరావతి మెరీనా’ అభివృద్ధి ప్రాజెక్టుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పీపీపీ విధానంలో 33 ఏళ్లు లీజు ప్రాతిపదికన ఎకరా స్థలంలో కృష్ణా నదీ తీరంలో దీనిని ఏర్పాటు చేయనున్నారు. అక్కడ కృష్ణా నదీ తీరంలో ఆధునిక మెరీనా సౌకర్యాలు, వినోద, ప్రజా వసతులు అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు ప్రైవేట్ డెవలపర్/ ఆపరేటర్ ఎంపిక కోసం టెండర్లు పిలవనున్నారు.
ఏపీ కేబినెట్ రాష్ట్ర పంచాయతీరాజ్ (రెండో సవరణ) బిల్లు -2026 ముసాయిదాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2025-26కిగాను భారీ, మధ్య, చిన్న తరహా జలవనరులకు సంబంధించి అంచనాలకు ఆమోదం తెలిపారు. ఏలూరు జిల్లాలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు 45.60 ఎకరాల్ని కేటాయించారు. నంద్యాలలో 250 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు కోసం 1,500 ఎకరాల్ని లీజుకు ఇవ్వాలని ఆమోదించారు. విశాఖపట్నల జిల్లాలో 18.57 ఎకరాల ప్రభుత్వ భూమిని రాష్ట్ర సేవా సమితికి బదిలీకి ఓకే చెప్పారు. విశాఖపట్నం జిల్లాలో ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు, నిర్మాణాలను క్రమీబద్దీకరించేందుకు జూన్ 30 వరకు గడువు పొడిగించేందుకు ఆమోదం తెలిపారు. రామాయపట్నానికి సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే మరికొన్ని కీలక అంశాలను ఆమోదించారు.
రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి