Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

మాటలు వద్దూ.. చిన్న కౌగిలింతతో మీ ప్రేమను తెలపండి ఇలా..

12 February 2026

IND vs NAM : నమీబియాతో భారత్ ఢీ.. ఢిల్లీ గడ్డపై పరుగుల వర్షం కురిపించే మొనగాళ్లు వీరే

12 February 2026

ఇస్రోకు అడుగడుగునా అవరోధాలు.. గగన్‌యాన్ మరింత ఆలస్యం.. కారణమేంటి..?

12 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తెలంగాణ»TG EAPCET 2026 Notification: విద్యార్ధులకు అలర్ట్.. మరికొన్ని గంటల్లోనే ఈఏపీసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల
తెలంగాణ

TG EAPCET 2026 Notification: విద్యార్ధులకు అలర్ట్.. మరికొన్ని గంటల్లోనే ఈఏపీసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

.By .12 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
TG EAPCET 2026 Notification: విద్యార్ధులకు అలర్ట్.. మరికొన్ని గంటల్లోనే ఈఏపీసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


హైదరాబాద్‌, ఫిబ్రవరి 12: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో 2026-27 విద్యాసంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీసెట్‌)కు సంబంధించిన నోటిఫికేషన్‌ మరో 2 రోజుల్లో విడుదల కానుంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ప్రకటన వెలువరించింది. తాజా ప్రకటన మేరకు ఫిబ్రవరి 14వ తేదీన తెలంగాణ ఈఏపీసెట్‌ 2026 పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదలకానుంది. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమవుతాయి. ఆన్‌లైన్ దరఖాస్తులు ఏప్రిల్ 4, 2026వ తేదీ వరకు కొనసాగుతాయి. పరీక్ష కేంద్రాలు, సిలబస్‌పై ఇప్పటికే అధికారులు కసరత్తు పూర్తి చేశారు.

ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు రాసే విద్యార్థులు ఈఏపీ సెట్‌కు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దీంతో ఇంటర్‌ హాల్‌టికెట్ల నంబర్ల ద్వారా పూర్తి డేటా తీసుకుంటారు. ఈ క్రమంలో సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ విజయకుమార్‌ రెడ్డి బుధవారం ఇంటర్‌ బోర్డు అధికారులతో మాట్లాడారు. నోటిఫికేషన్‌ను దృష్టిలో ఉంచుకుని హాల్‌టికెట్లు పూర్తి డేటాతో ఆన్‌లైన్‌లో ఉంచాలని సూచించారు. ఈసారి పరీక్షలకు హాజరయ్యే బాలికలకు దగ్గరి ప్రాంతాల్లోనే పరీక్ష కేంద్రాలు కేటాయించేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సెట్‌ అధికారులు తెలిపారు. ముందస్తుగా దరఖాస్తు చేసే వారికి మొదటి ప్రాధాన్యం కింద పరీక్ష కేంద్రాన్ని కేటాయించే వీలుంటుందని అన్నారు.

అంతేకాకుండా ఈఏపీసెట్‌ పరీక్షలో ఈ ఏడాది మరో కీలక మార్పు కూడా చేశారు. ఆన్‌లైన్‌లో ఈఏపీ సెట్‌ పరీక్ష రాసిన తర్వాత విద్యార్థులు కంప్యూటర్‌ లాగ్‌ ఔట్‌ చేయగానే ఆ సెషన్‌లో తాము రాసిన పరీక్షలో ఎన్ని మార్కులు వచ్చాయనేది అప్పుడే స్క్రీన్‌పై చెక్‌ చేసుకునే వెసులుబాటును తొలిసారిగా కల్పిస్తున్నారు. దీంతో ఏ ర్యాంకు వస్తుందనేది వెనువెంటనే అంచనాకు వచ్చే వీలుంది. పరీక్ష అనంతరం జరిగే కౌన్సెలింగ్‌లో తొలి ప్రాధాన్యం ర్యాంకును బట్టి కాలేజీలను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. కాగా షెడ్యూల్‌ ప్రకారం ఈఏపీసెట్‌ 2026 అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్‌ పరీక్షలు మే 4, 5 తేదీల్లో ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతాయి. మే 9 నుంచి జూన్ 11 వరకు ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు జరుగుతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

JEE Main 2026 Result Date: జేఈఈ మెయిన్‌ సెషన్ 1 ఫలితాల విడుదల వాయిదా.. కొత్త తేదీ ఇదే!

12 February 2026

Musi River : మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

11 February 2026

Sangareddy: సంగారెడ్డి జిల్లా ఇంద్రేశంలో అగ్నిప్రమాదం – Telugu News | Dense Smoke Engulfs Indresham After Plastic Godown Fire video tv9d

11 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

మాటలు వద్దూ.. చిన్న కౌగిలింతతో మీ ప్రేమను తెలపండి ఇలా..

12 February 2026

కౌగిలింత అనేది మనలో దూరం తగ్గడానికి, నేను కూడా నీకు ఎప్పుడూ ఇంతే దగ్గరగా ఉంటాను అంటూ ప్రామీస్ చేస్తున్నాను.…

IND vs NAM : నమీబియాతో భారత్ ఢీ.. ఢిల్లీ గడ్డపై పరుగుల వర్షం కురిపించే మొనగాళ్లు వీరే

12 February 2026

ఇస్రోకు అడుగడుగునా అవరోధాలు.. గగన్‌యాన్ మరింత ఆలస్యం.. కారణమేంటి..?

12 February 2026

Maoists Threaten To Ap Ministers Found A Number,ఏపీలో నలుగురు మంత్రులకు బెదిరింపులు.. అందులో ఓ మొబైల్ నంబర్, ఎవరిదో తెలిసి – one mobile number found in maoists threaten to four ministers case

12 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

మాటలు వద్దూ.. చిన్న కౌగిలింతతో మీ ప్రేమను తెలపండి ఇలా..

12 February 2026

IND vs NAM : నమీబియాతో భారత్ ఢీ.. ఢిల్లీ గడ్డపై పరుగుల వర్షం కురిపించే మొనగాళ్లు వీరే

12 February 2026

ఇస్రోకు అడుగడుగునా అవరోధాలు.. గగన్‌యాన్ మరింత ఆలస్యం.. కారణమేంటి..?

12 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.