సినిమా ఇండస్ట్రీలో విడాకులిప్పుడూ సర్వసాధారమైపోయాయి. పెళ్లి చేసుకున్న ఒకటి, రెండేళ్లకే చాలా జంటలు విడిపోతున్నాయి. అదే క్రమంలో ఏళ్ల కొద్దీ కాపురం చేస్తున్న దంపతులు కూడా విడాకులు తీసుకుంటున్నారు. కొత్తగా పెళ్లైన హీరో, హీరోయిన్స్ దగ్గర నుంచి సీనియర్ హీరో, హీరోయిన్స్ కూడా సడన్ గా విడాకులు అనౌన్స్ చేసి షాక్ ఇస్తున్నారు. కాగా కొంతమంది హీరోయిన్స్ విడాకుల తర్వాత కనిపించకుండా పోతున్నారు. మరికొంతమంది హీరోయిన్స్ తమ సినిమాలతో బిజీగా మారిపోతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ కూడా విడాకుల తర్వాత సినిమాల్లో బిజీగా ఉంది. కెరీర్ పీక్ లో ఉండగానే పెళ్లి చేసుకుంది. అది కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ పెళ్ళైన 16రోజులకే విడాకులు తీసుకుంది. ఇంతకూ ఆమె ఎవరంటే..
ఆ ఇద్దరు హీరోలు నాతో చాలా ఫ్రెండ్లిగా ఉంటారు.. ఆసక్తికర విషయం చెప్పిన టాలీవుడ్ విలన్
పెళ్ళైన కొద్దీ రోజులకే భర్తతో మనస్పర్థలు కారణంగా విడాకులు తీసుకుంది. ఇప్పుడు తిరిగి సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తుంది. ఇంతకూ ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.? ఆమె ఎవరో కాదు అందాల భామ ఎస్తర్ నోరోన్హా.. ఈ నటి గురించి చాలా మందికి తెలియక పోవచ్చు.. కానీ ఆమెను చూస్తే ఇట్టే గుర్తుపడతారు. ఈ అమ్మడు కన్నడ, తెలుగు సినిమాల్లో నటించి మెప్పించింది. 2019 జనవరిలో గాయకుడు మరియు రాపర్ నోయెల్ సీన్‌ను వివాహం చేసుకుంది ఈ చిన్నది. కానీ ఈ ఇద్దరూ కేవలం 16రోజులకే విడిపోయారు.
ఇవి కూడా చదవండి
అచ్చం మామ పొలికే.. ఉదయ్ కిరణ్ మేనకోడలు ఇప్పుడు ఎలా ఉందొ చూశారా..
నోయెల్ సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే నటుడిగానూ రాణిస్తున్నాడు నోయెల్. కాగా ఎస్తర్ నోరోన్హా సినిమాలతో బిజీగా ఉంది. ఓ వైపు హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే మరో వైపు సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆమె బోల్డ్ రోల్స్ లో కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. మొన్నామధ్య టెనెంట్ అనే సినిమాలో కనిపించింది. ఇటీవలే అమరావతికి ఆహ్వానం అనే సినిమాలో నటిస్తుంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.
ముట్టుకుంటే కందిపోతుందేమో..! మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి హీరోయిన్ ఎంట్రీ.?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

