Kadapa Bangalore Railway Line,ఏపీలో కొత్తగా మరో రైల్వే లైన్.. ఈ రూట్‌లో రూ.2,505 కోట్లతో, బెంగళూరు 5 గంటల్లో వెళ్లొచ్చు – mp daggubati purandeswari requests railway minister ashwini vaishnaw on kadapa bangalore new railway line
Kadapa Bangalore New Railway Line: ఏపీలో కొత్త రైల్వే లైన్‌కు సంబంధించి కేంద్రానికి రిక్వెస్ట్ వెళ్లింది. కడప నుంచి బెంగళూరుకు కొత్త రైలు మార్గంపై రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ రైల్వే లైన్ రాయలసీమ అభివృద్ధికి కీలకమైనదని పురందేశ్వరి వివరించారు. ఈ రైల్వే లైన్‌పై సమీక్ష చేసి పనుల్ని వేగవంతం చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టుపై పలు కీలక అంశాలను ప్రస్తావించారు.
హైలైట్:
కడప-బెంగళూరు కొత్త రైల్వే లైన్
రైల్వేమంత్రికి పురందేశ్వరి రిక్వెస్ట్
పనులు వేగవంత చేయాలన్నారు
కడప బెంగళూరు రైల్వే లైన్(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైల్వే ప్రాజెక్టులపై ఎంపీల నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు వెళుతున్నాయి. తాజాగా మరో కొత్త రైల్వే ప్రాజెక్టుపై రైల్వేమంత్రికి రిక్వెస్ట్ అందజేశారు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి. రాయలసీమకు కీలకమైన కడప-బెంగళూరు రైల్వే లైన్ ప్రాజెక్టు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఈ రైలు మార్గం రాయలసీమ ప్రాంత అభివృద్ధికి అత్యంత కీలకమైనదని పురందేశ్వరి అన్నారు. ఈ రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి పునఃసమీక్షించి, పనులను వేగవంతం చెయ్యాలని రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు. ఏపీ రవాణాశాఖమంత్రి మండిపల్లి రాంప్రసాద్ కూడా పురందేశ్వరి వెంట ఉన్నారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టు 2008లో మంజూరు చేశారని.. మొత్తం 266 నుంచి 268 కి.మీ చేపట్టాల్సి ఉండగా.. కేవలం కడప-పెండ్లిమర్రి మధ్య 21 కిలోమీటర్లు మాత్రమే పనులు పూర్తి చేశారన్నారు. ఈ రైల్వే లైన్ ద్వారా కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ పార్కుకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు.’రాయలసీమ అభివృద్ధికి అత్యంత కీలకమైన కడప–బెంగళూరు రైల్వే లైన్ ప్రాజెక్టును పరిశీలించి, త్వరితగతిన అమలు చేయాలని గౌరవ రైల్వే మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ గారిని కోరడం జరిగింది. 2008లో ఆమోదం పొందిన ఈ ప్రాజెక్టు ఇప్పటివరకు పరిమిత పురోగతితోనే కొనసాగుతోంది. Aspirational జిల్లాలైన కడప, అన్నమయ్య ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ఈ రైల్వే లైన్ ఎంతో కీలకం. కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్‌కు ఊతం, బెంగళూరుతో నేరుగా రైల్వే అనుసంధానం, పరిశ్రమలు, MSMEs వృద్ధి, విద్యార్థులు, రోగులు, ఉద్యోగార్థులకు సౌలభ్యం, పర్యాటకాభివృద్ధి & ఉపాధి అవకాశాలు. ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి, రాష్ట్ర ప్రభుత్వంతో వ్యయ భాగస్వామ్య విధానాన్ని మళ్ళీ పరశీలించి, సమన్వయం చేసి, తగిన సమయంలో పూర్తి చేయాలని కోరడం జరిగింది’ అని పురందేశ్వరి పోస్ట్ చేశారు.
ఈ కడప- బెంగళూరు మార్గాన్ని పులివెందుల మీదుగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముద్దనూరు- పులివెందుల- ముదిగుబ్బ- శ్రీసత్యసాయి మధ్య రూ.2,505 కోట్లతో 110 కి.మీ మేర లైన్‌కు సంబంధించి అడుగులు పడుతున్నట్లు రెండు నెలల క్రితం చర్చ జరిగింది. ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే బెంగళూరు త్వరగా వెళ్లొచ్చంటున్నారు.
రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి