
ఉపాధి హామీ పథకానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిధులు ఖర్చు చేస్తాయి. అయితే ఉపాధి హామీకి సంబంధించి జాబ్ కార్డు ఉంటుంది. అయితే ప్రజలకు కొత్త జాబ్‌కార్డు జారీ విధానాన్ని కేంద్రం మరింత సులభతంర చేసింది. దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోనే జాబ్ కార్డును జారీ చేయనున్నారు. ఒకవేళ ఎవరికైనా జాబ్ కార్డు కావాలవంటే ఆయా గ్రామాల్లో ఉండే ఫీల్డ్ అసిస్టెంట్‌ను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. జాబ్ కార్డు కోసం ఈకేవైసీ పూర్తి చేస్తే దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. ఈ మేరకు దరఖాస్తుల్ని పరిశీలించిన తర్వాత అధికారులు నిర్దేశిత సమయంలో జాబ్ కార్డు జారీ చేస్తారు.
జాబ్ కార్డులు ఉన్న ఉపాధి హామీ కూలీలకు సంబంధించిన ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేశారు. అలాగే ఉపాధి పనుల కోసం వచ్చిన కూలీలు కచ్చితంగా ఫేస్ రికగ్నేషన్ ద్వారా (ముఖ ఆధారిత) హాజరు వేయాల్సిందే. గతంలో ఉపాధి హామీ పనులకు సంబంధించి అవకతవకలు జరిగాయి. కొందరు ఒకటి రెండు చోట్ల పేర్లను నమోదు చేయించుకున్నారు. అలాగే ఒకరికి బదులు మరొకరు పనికి వెళ్లేవారు. అసలు పనికి రాకపోయినా సరే కొందరు మస్టర్లు వేశారు. ఇలా ఎన్నో లోటుపాట్లను గుర్తించిన తర్వాత కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్రం ఆదేశాలతో ముఖ ఆధారిత హాజరును నమోదు చేస్తున్నారు.. ప్రస్తుతం ఈ విధానం అమల్లో ఉన్నా.. మార్చి తర్వాత పూర్తిగా అమల్లోకి తీసుకొస్తారని చెబుతున్నారు. అప్పుడు ఎలాంటి అవకతవకలకు అవకాశం ఉండదు అంటున్నారు. మొత్తం మీద ఉపాధి హామీ పథకంలో మార్పులతో పాటుగా జాబ్ కార్డుని వేగంగా జారీ చేస్తారు.. అదే సమయంలో హాజరు విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే రాష్ట్రంలో ఎవరికైనా జాబ్ కార్డులు కావాలంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు.


