Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Afghanistan vs UAE : బౌలింగ్‌లో నిప్పులు.. బ్యాటింగ్‌లో మెరుపులు..రషీద్ ఖాన్ సేన నయా రికార్డు

16 February 2026

Funky Movie: ‘ఫంకీ’ సినిమాకు మిక్స్‌డ్ టాక్.. ఈ మూవీని రిజెక్ట్ చేసిన టాలీవుడ్ యంగ్ హీరో ఎవరో తెలుసా?

16 February 2026

డ్రై క్లీనర్ మంత్లీ ఇన్‌కం.. రూ.2 లక్షలు నెట్టింట వైరల్‌గా పోస్ట్!

16 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»చికెన్ Vs గుడ్లు.. బరువు తగ్గాలనుకునేవారికి ఏది బెస్ట్..? తప్పక తెలుసుకోండి..
తాజా వార్తలు

చికెన్ Vs గుడ్లు.. బరువు తగ్గాలనుకునేవారికి ఏది బెస్ట్..? తప్పక తెలుసుకోండి..

.By .16 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
చికెన్ Vs గుడ్లు.. బరువు తగ్గాలనుకునేవారికి ఏది బెస్ట్..? తప్పక తెలుసుకోండి..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


మన శరీరం కండరాల నిర్మాణానికి, దెబ్బతిన్న కణజాలాలను మరమ్మతు చేయడానికి ప్రోటీన్ అత్యంత ఆవశ్యకమైన పోషకం. అయితే ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం.. భారతీయులలో చాలా మంది తగినంత ప్రోటీన్ తీసుకోవడం లేదని తేలింది. ప్రోటీన్ అనగానే మనకు గుర్తొచ్చేవి చికెన్, గుడ్లు. మరి ఈ రెండింటిలో ఏది బెస్ట్? పోషకాల పరంగా ఏది గెలుస్తుంది? అనే ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

మీకు రోజుకు ఎంత ప్రోటీన్ అవసరం?

ఒక వ్యక్తికి అవసరమయ్యే ప్రోటీన్ వారి శరీర బరువుపై ఆధారపడి ఉంటుంది. ప్రతి కిలో శరీర బరువుకు 0.8 గ్రాముల నుండి 1 గ్రాము ప్రోటీన్ అవసరం. మీరు 60 కిలోల బరువు ఉంటే రోజుకు సుమారు 48 నుండి 60 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి.

చికెన్ Vs గుడ్లు: ప్రోటీన్ లెక్కలు

ప్రోటీన్ పరిమాణం విషయానికి వస్తే చికెన్‌ది పైచేయిగా కనిపిస్తుంది. 100 గ్రాముల లీన్ చికెన్‌లో 25 – 27 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అదేవిధంగా ఒక పెద్ద గుడ్డులో 6-7 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
అంటే 100 గ్రాముల చికెన్ ఇచ్చే ప్రోటీన్ కావాలంటే మీరు సుమారు 4 గుడ్లు తినాల్సి ఉంటుంది.

పోషకాల పరంగా ఏది మేలు?

కేవలం ప్రోటీన్ మాత్రమే కాకుండా ఇతర పోషకాలలో రెండూ ప్రత్యేకమైనవే.. చికెన్‌లో పాస్పరస్, సెలీనియం, విటమిన్ B3 పుష్కలంగా ఉంటాయి. గుడ్లు మల్టీ విటమిన్ ఆహారం వంటివి. వీటిలో విటమిన్ D, B12, ఐరన్, జింక్, రాగి, కంటికి మేలు చేసే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అలాగే మెదడు పనితీరుకు అవసరమైన కోలిన్ గుడ్లలో అధికం.

బరువు తగ్గాలనుకునే వారికి ఏది ఉత్తమం?

మీరు బరువు తగ్గడంపై దృష్టి పెడితే.. లీన్ చికెన్ ఉత్తమ ఎంపిక. ఇందులో కొవ్వు తక్కువగా, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆకలిని త్వరగా వేయకుండా నియంత్రిస్తుంది. అయితే ప్రతిరోజూ అల్పాహారంలో భాగంగా గుడ్లు తీసుకోవడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. ఆరోగ్యవంతులు రోజుకు రెండు గుడ్ల వరకు నిరభ్యంతరంగా తినవచ్చని నిపుణులు చెబుతున్నారు.

బడ్జెట్ – సౌకర్యం

చికెన్‌తో పోలిస్తే గుడ్లు చౌకగా లభిస్తాయి. వండటం కూడా సులభం. పిల్లలు, గర్భిణీ స్త్రీలకు ఇవి తక్షణ పోషణను అందిస్తాయి. మరోవైపు కండరాల పెరుగుదల కోరుకునే జిమ్ ప్రియులకు చికెన్ అత్యంత శక్తివంతమైన ఆహారం.

మీ లక్ష్యం కేవలం ప్రోటీన్ అయితే చికెన్ ఎంచుకోండి. ప్రోటీన్‌తో పాటు అన్ని రకాల విటమిన్లు అందాలంటే గుడ్లను డైట్‌లో చేర్చుకోండి. నిజానికి ఈ రెండింటినీ సమపాళ్లలో తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పూర్తి అమైనో ఆమ్లాలు మరియు ఖనిజాలు అందుతాయి.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Afghanistan vs UAE : బౌలింగ్‌లో నిప్పులు.. బ్యాటింగ్‌లో మెరుపులు..రషీద్ ఖాన్ సేన నయా రికార్డు

16 February 2026

Funky Movie: ‘ఫంకీ’ సినిమాకు మిక్స్‌డ్ టాక్.. ఈ మూవీని రిజెక్ట్ చేసిన టాలీవుడ్ యంగ్ హీరో ఎవరో తెలుసా?

16 February 2026

డ్రై క్లీనర్ మంత్లీ ఇన్‌కం.. రూ.2 లక్షలు నెట్టింట వైరల్‌గా పోస్ట్!

16 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Afghanistan vs UAE : బౌలింగ్‌లో నిప్పులు.. బ్యాటింగ్‌లో మెరుపులు..రషీద్ ఖాన్ సేన నయా రికార్డు

16 February 2026

Afghanistan vs UAE : టీ20 ప్రపంచకప్ 2026లో అఫ్గానిస్థాన్ జట్టు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. సోమవారం ఢిల్లీలోని అరుణ్…

Funky Movie: ‘ఫంకీ’ సినిమాకు మిక్స్‌డ్ టాక్.. ఈ మూవీని రిజెక్ట్ చేసిన టాలీవుడ్ యంగ్ హీరో ఎవరో తెలుసా?

16 February 2026

డ్రై క్లీనర్ మంత్లీ ఇన్‌కం.. రూ.2 లక్షలు నెట్టింట వైరల్‌గా పోస్ట్!

16 February 2026

రైతన్నలకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. అకౌంట్లోకి బోనస్ డబ్బులు జమ!.. మీకు వచ్చాయా?

16 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Afghanistan vs UAE : బౌలింగ్‌లో నిప్పులు.. బ్యాటింగ్‌లో మెరుపులు..రషీద్ ఖాన్ సేన నయా రికార్డు

16 February 2026

Funky Movie: ‘ఫంకీ’ సినిమాకు మిక్స్‌డ్ టాక్.. ఈ మూవీని రిజెక్ట్ చేసిన టాలీవుడ్ యంగ్ హీరో ఎవరో తెలుసా?

16 February 2026

డ్రై క్లీనర్ మంత్లీ ఇన్‌కం.. రూ.2 లక్షలు నెట్టింట వైరల్‌గా పోస్ట్!

16 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.