లైలా తర్వాత ఏడాది పాటు గ్యాప్ తీసుకున్నాడు విశ్వక్ సేన్. ఫంకీ సినిమా కోసం అన్నీ తానై వ్యవహరించాడు. ప్రమోషన్లలోనూ చురుగ్గా పాల్గొన్నాడు. అందుకు తగ్గట్టుగానే ఈ మూవీ టీజర్, ట్రైలర్ ఆడియెన్స్ ను బాగానే ఆకట్టుకున్నాయి. దీంతో ఫంకీ మూవీకి రిలీజ్ కు ముందే పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. అయితే ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 13న రిలీజైన ఫంకీ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. అనుదీప్ వన్ లైనర్స్ పంచులు బాగానే పేలినా జాతి రత్నాలు రేంజ్ లో మరీ సినిమా లేదని నెగెటివ్ కామెంట్స్ వినిపించాయి. ఈ సినిమాకు వస్తోన్నటాక్, రివ్యూల గురించి నాగ వంశి స్పందిస్తూ ‘నేనేమీ సాగర సంగమం సినిమా చేశానని చెప్పలేదు మేము చేసింది కామెడీ సినిమా’ అని చెప్పడం గమనార్హం. ఇదిలా ఉంటే ఫంకీ సినిమా రిజల్ట్ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించి ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. అదేంటంటే..
నిజానికి ఈ సినిమాకి విశ్వక్ సేన్ మొదటి ఎంపిక కాదట .ముందుగా డైరెక్టర్ అనుదీప్ ఈ సినిమా కథతో పాన్ ఇండియ హీరో తేజ సజ్జను కలిసారట. అయితే అప్పటికే మిరాయ్ సినిమాతో బిజీగా ఉండడం, ఇతరత్రా కారణాలతో తేజ ఈ కథను చేయలేనని చెప్పాడట. దీంతో ఈ కథ విశ్వక్ సేన్ వద్దకు వెళ్లిందని సమాచారం. అనుదీప్ కథ విన్న విశ్వక్ వెంటనే ఒకే చెప్పడంతో ఫంకీ సినిమా పట్టాలెక్కిందట. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. హనుమాన్, మిరాయ్ లతో పాన్ ఇండియా హీరోగా మారిపోయిన తేజ సజ్జ ఈ సినిమాని రిజెక్ట్ చేసి సేఫ్ అయ్యాడని కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
The Grand Pre Release Event of #Funky explode with swag, style and electrifing energy💥
Join Us For Exclusive Updates 🔗https://t.co/ThGXnb5IpX#FunkyPreReleaseEvent #FunkyInCinemasNow
Mass Ka Das @VishwakSenActor @11Lohar @anudeepfilm #BheemsCeciroleo @vamsi84 #SaiSoujanya… pic.twitter.com/qsWctUgO4g
— Shreyas Media (@shreyasgroup) February 16, 2026
ఫంకీ సినిమాలో హీరో విశ్వక్ సేన్ సరసన డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్ హీరోయిన్ గా నటించింది. అలాగే ఈశ్వరి రావు, వీటీవీ గణేశ్, సంపత్ రాజ్, నరేష్, అదితీ భావరాజు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఎప్పటిలాగానే హీరో విశ్వక్ సేన్ తన యాక్టింగ్ తో మెప్పించాడు. సినిమాను తన భుజాలపై మోశాడు. కానీ సినిమా విజయానికి అది ఏ మాత్రం సరిపోలేదు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

