Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Gold Price Today: తగ్గిన బంగారం ధర.. కానీ వెండి ధరలు మాత్రం.?

16 February 2026

AI Impact Summit 2026: వికసిత్‌ భారత్ వైపు మరో అడుగు.. ఇండియా AI ఇంపాక్ట్ ఎక్స్‌పోను ప్రారంభించిన ప్రధాని మోదీ

16 February 2026

శ్రీశైలం ఘాట్ రోడ్‌లో ప్రమాదం.. గుంతలోకి ఒరిగిన బస్సు.. షాక్‌లో ప్యాసింజర్స్

16 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»జాతీయం»RBI Assistant Jobs 2026: డిగ్రీ అర్హతతో రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 650 ఉద్యోగాలు.. నెలకు రూ.60 వేల వరకు జీతం
జాతీయం

RBI Assistant Jobs 2026: డిగ్రీ అర్హతతో రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 650 ఉద్యోగాలు.. నెలకు రూ.60 వేల వరకు జీతం

.By .16 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
RBI Assistant Jobs 2026: డిగ్రీ అర్హతతో రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 650 ఉద్యోగాలు.. నెలకు రూ.60 వేల వరకు జీతం
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ).. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 650 పోస్టులను భర్తీ చేయనుంది. అత్యధికంగా ముంబయిలో 249 పోస్టులు ఉన్నాయి. హైదరాబాద్‌లో 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏదైనా డిగ్రీలో అర్హత కలిగిన అభ్యర్ధులు ఎవరైనా ఫిబ్రవరి 16, 2026వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమినరీ, మెయిన్ రాత పరీక్షల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

రాష్ట్రాల వారీగా పోస్టుల వివరాలు ఇలా..

  • ముంబయిలో పోస్టుల సంఖ్య: 249
  • చెన్నైలో పోస్టుల సంఖ్య: 53
  • కాన్పూర్ అండ్‌ లక్నోలో పోస్టుల సంఖ్య: 50
  • న్యూఢిల్లీలో పోస్టుల సంఖ్య: 49
  • గువాహటిలో పోస్టుల సంఖ్య: 36
  • భోపాల్‌లో పోస్టుల సంఖ్య: 30
  • కోల్‌కతాలో పోస్టుల సంఖ్య: 29
  • బెంగళూరులో పోస్టుల సంఖ్య: 24
  • అహ్మదాబాద్‌లో పోస్టుల సంఖ్య: 20
  • చండీగఢ్‌లో పోస్టుల సంఖ్య: 20
  • భువనేశ్వర్‌లో పోస్టుల సంఖ్య: 18
  • నాగ్‌పూర్‌లో పోస్టుల సంఖ్య: 17
  • పట్నాలో పోస్టుల సంఖ్య: 17
  • జైపూర్‌లో పోస్టుల సంఖ్య: 11
  • హైదరాబాద్‌లో పోస్టుల సంఖ్య: 11
  • తిరువనంతపురం & కొచ్చిలో పోస్టుల సంఖ్య: 10
  • జమ్మూలో పోస్టుల సంఖ్య: 6

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే ఏదైనా డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పాస్ మార్కులు ఉంటే సరిపోతుంది. అలాగే బేసిక్‌ కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి. స్థానిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం తెలిసి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి ఫిబ్రవరి 1, 2026 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల వరకు వయసులో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో మార్చి 8, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్‌, ఓబీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.450, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులు రూ.50 చొప్పున తప్పనిసరిగా చెల్లించాలి. ప్రిలిమ్స్‌, మెయిన్‌ రాత పరీక్షలు, భాషా నైపుణ్య పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.58,514 జీతంతో పాటు ఇతర అలవెన్స్‌లు అందిస్తారు.

ముఖ్యమైన తేదీలు ఇవే..

  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 16, 2026.
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 8, 2026.
  • ప్రిలిమినరీ రాత పరీక్ష తేదీ: ఏప్రిల్ 11, 2026.
  • మెయిన్ రాత పరీక్ష తేదీ: జూన్‌ 7, 2026.

రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఉద్యోగాల ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

ఫిబ్రవరి 17న రాహుగ్రస్త సూర్యగ్రహణం… భారత్‌పై ఎఫెక్ట్‌ ఎంత

16 February 2026

Ration Card: రేషన్ కార్డు ఉన్నవారికి కేంద్రం అదిరిపోయే గుడ్‌న్యూస్.. 24 గంటల పాటు సేవలు.. ఎప్పుడైనా తీసుకోవచ్చు..

16 February 2026

PM Modi: ప్రపంచం చూపు భారత్ వైపు.. 38 దేశాలతో వాణిజ్య ఒప్పందాలు.. నవ శకానికి నాంది పలికిన సంస్కరణలు.

16 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Gold Price Today: తగ్గిన బంగారం ధర.. కానీ వెండి ధరలు మాత్రం.?

16 February 2026

బంగారం ధరలు కుప్పకూలాయి. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేని విధంగా పెరిగిన ధరలు సోమవారం నేల చూపులు చూశాయి.…

AI Impact Summit 2026: వికసిత్‌ భారత్ వైపు మరో అడుగు.. ఇండియా AI ఇంపాక్ట్ ఎక్స్‌పోను ప్రారంభించిన ప్రధాని మోదీ

16 February 2026

శ్రీశైలం ఘాట్ రోడ్‌లో ప్రమాదం.. గుంతలోకి ఒరిగిన బస్సు.. షాక్‌లో ప్యాసింజర్స్

16 February 2026

Maha Shivratri: మహా శివరాత్రి వేడుకల్లో సినిమా తారలు.. భక్తి పాటలకు హీరోయిన్ల స్టెప్పులు.. వీడియోలు ఇదిగో

16 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Gold Price Today: తగ్గిన బంగారం ధర.. కానీ వెండి ధరలు మాత్రం.?

16 February 2026

AI Impact Summit 2026: వికసిత్‌ భారత్ వైపు మరో అడుగు.. ఇండియా AI ఇంపాక్ట్ ఎక్స్‌పోను ప్రారంభించిన ప్రధాని మోదీ

16 February 2026

శ్రీశైలం ఘాట్ రోడ్‌లో ప్రమాదం.. గుంతలోకి ఒరిగిన బస్సు.. షాక్‌లో ప్యాసింజర్స్

16 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.