Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Chiranjeevi: చేతికి కట్టు.. ఏం జరిగిందో చెప్పిన మెగాస్టార్ చిరంజీవి..

16 February 2026

కోటప్పకొండ తిరునాళ్లలో ఒరిగిపోయిన భారీ ప్రభ

16 February 2026

శివపార్వతుల కల్యాణంలో సాక్షాత్కరించిన నాగరాజు

16 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Smart Mosquito Surveillance System In Tirupati,దోమలపై హైటెక్ యుద్ధం.. ఏఐ అస్త్రం ప్రయోగిస్తున్న ఏపీ.. అక్కడి నుంచే మొదలు.. – ai based smart mosquito surveillance system pilot project in tirupati
ఆంధ్రప్రదేశ్

Smart Mosquito Surveillance System In Tirupati,దోమలపై హైటెక్ యుద్ధం.. ఏఐ అస్త్రం ప్రయోగిస్తున్న ఏపీ.. అక్కడి నుంచే మొదలు.. – ai based smart mosquito surveillance system pilot project in tirupati

.By .16 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Smart Mosquito Surveillance System In Tirupati,దోమలపై హైటెక్ యుద్ధం.. ఏఐ అస్త్రం ప్రయోగిస్తున్న ఏపీ.. అక్కడి నుంచే మొదలు.. – ai based smart mosquito surveillance system pilot project in tirupati
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ప్రజారోగ్యానికి పెను సవాల్ విసురుతున్న దోమలపై హైటెక్ యుద్ధానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. దోమల నియంత్రణ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు ఉపయోగించనుంది. ఏఐ ఆధారంగా పనిచేసే స్మార్ట్ మస్కిటో సర్వేలెన్స్ సిస్టమ్ ద్వారా దోమలను కట్టడి చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా తిరుపతిలో పైలెట్ ప్రాజెక్టు కింద ఈ విధానాన్ని పరిశీలించనున్నారు. అక్కడ వచ్చే ఫలితాల ఆధారంగా మరిన్ని నగరాలకు విస్తరించాలనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. తిరుపతిలో ప్రైవేట్ సంస్థకు ఈ పనులు అప్పగించనున్నారు.

Smart Mosquito Surveillance System in Tirupati
తిరుపతిలో స్మార్ట్ దోమల నిఘా వ్యవస్థ(ఫోటోలు– Samayam Telugu)
దోమలు.. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా.. ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న సమస్య. ప్రజారోగ్యానికి ప్రధాన సవాలు విసురుతున్నవి దోమలే.. ఈ నేపథ్యంలో దోమలపై హైటెక్ యుద్ధానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. టెక్నాలజీ సాయంతో దోమలకు చెక్ పెట్టాలని భావిస్తోంది. అందులో భాగంగా కృత్తిమ మేధ ఆధారంగా పనిచేసే స్మార్ట్ దోమల నిఘా వ్యవస్థ (స్మార్ట్ మస్కిటో సర్వేలెన్స్ సిస్టమ్) అందుబాటులోకి తెస్తోంది ఏపీ ప్రభుత్వం. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో తొలుత ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. ఇక్కడ వచ్చే ఫలితాల ఆధారంగా రాష్ట్రంలోని ఇతర ప్రధాన నగరాలకు ఈ స్మార్ట్ మస్కిటో సర్వేలెన్స్ సిస్టమ్ విస్తరించే ఆలోచనలు చేస్తున్నారు.

స్మార్ట్ మస్కిటో సర్వేలెన్స్ సిస్టమ్.. ఎలా పనిచేస్తుందంటే..

స్మార్ట్ మస్కిటో సర్వేలెన్స్ సిస్టమ్‌లో భాగంగా తొలుత ముందుగా నిర్ణయించిన కొన్ని ప్రాంతాలలో ఐవోటీ పరికరాలు (Internet of Things) ఏర్పాటు చేస్తారు. ఈ పరికరాలు ప్రత్యేకమైన వాసన కలిగి ఉంటాయి. ఫిరమోన్ సాయంతో ఈ ప్రత్యేక వాసన వచ్చేలా అధికారులు వీటిని రూపొందించారు. దీంతో దోమలను ఇవి సులువుగా ఆకర్షిస్తాయి. దీని ద్వారా ఆ ప్రాంతంలో దోమల సాంద్రత ఎలా ఉంది.. అవి ఏ జాతి దోమలు, వాటి లింగం ఏంటనే వివరాలను ఈ ఐవోటీ పరికరాలు గుర్తిస్తాయి. ఈ సమాచారాన్ని వెంటనే సెంట్రల్ డ్యాష్ బోర్డుకు పంపిస్తుంది. ఈ డ్యాష్ బోర్డు.. ఏఐ సాయంతో ఈ వివరాలను విశ్లేషించి.. ఆ ప్రాంతంలో దోమల తీవ్రత ఎలా ఉందనే దానిపై అధికారులను అప్రమత్తం చేస్తుంది. ఆ తర్వాత దోమల నియంత్రణ కోసం డ్రోన్ల సాయంతో మందులను పిచికారీ చేసేలా ప్రణాళికలు రచించారు. మరోపతి తిరుపతిలో దోమలు అధికంగా ఉండే 250 హాట్‌స్పాట్లు గుర్తించారు. వీటిలోని కొన్ని ప్రాంతాలలో జాప్ ట్రాపులు, ఐవోటీ సెన్సార్లు ఏర్పాటు చేయనున్నారు. 20 లక్షలతో నాలుగుచోట్ల ఈ పరికరాలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే తిరుపతిలో ఈ పనులను ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించనున్నారు. ఈ నాలుగుచోట్ల వచ్చే ఫలితాల ఆధారంగా తిరుపతి మొత్తం ఈ సేవలు విస్తరించే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఈ స్మార్ట్ మస్కిటో సర్వేలెన్స్ సిస్టమ్‌ను తిరుపతితో పాటుగా విశాఖ, విజయవాడ, కర్నూలు, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి ప్రాంతాల్లో అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి