వైసీపీ నేత బొత్స సత్యనారాయణపై కిరాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యలు, అనుకరణ వివాదాస్పదమైంది. కిరాక్ ఆర్పీ తీరుపై వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేత నాగ మల్లేశ్వరి.. కిరాక్ ఆర్పీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని.. లేకపోతే 2029 తర్వాత వైసీపీ కార్యకర్తలు తొక్కిపట్టి నార తీస్తారంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.

” కిరాక్ ఆర్పీ.. ఒళ్లు బలిసి మాట్లాడుతున్నావ్. ఎవరిని పడితే వాళ్లను, ఏదిపడితే అది మాట్లాడుతున్నావ్. కాస్త ఒళ్లూ, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. లోపాలుంటే చెప్పటంలో తప్పులేదు. కానీ వ్యక్తిలోని లోపాన్ని అవహేళన చేస్తూ నువ్వు చేస్తున్న యాక్టింగ్, రాబోయే రోజులలో నీకు ప్రాక్టీస్ అవుతుంది. బొత్స గారి గురించి మాట్లాడే అర్హత నీకుందా. ఆయన చిటికెన వేలి మీద ఉన్న వెంట్రుకతో కూడా నువ్వు సమానం కాదు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా నీ గురించి ఎందుకులే అనుకున్నా. కానీ చాలా శ్రుతిమించిపోయావ్. జాగ్రత్త.”
“ఉత్తరాంధ్ర ప్రాంతానికి వస్తే సొరకు ఎరేసినట్లు వేసేస్తారు. ఎవరిని చూసి మాట్లాడుతున్నావ్. కోటీ 32 లక్షల మంది తొక్కిపట్టి నార తీసే రోజు వస్తుంది. కంట్రోల్‌గా ఉండు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మర్యాదగా ఉంటే బాగుంటుంది. మరోసారి వైసీపీ నేతలపై ఇష్టానుసారం మాట్లాడితే.. ఇప్పుడు చేసే యాక్టింగ్ నిజమవుద్ది. ఏ గుళ్ల ముందో, రైల్వేస్టేషన్ల ముందో, బస్టాండ్ల వద్దో అడుక్కుంటావ్.. నోరు, ప్రవర్తన అదుపులో పెట్టుకో.” అంటూ వైసీపీ నేత నాగ మల్లేశ్వరి వార్నింగ్ ఇచ్చారు.
అయితే కిరాక్ ఆర్పీ మాట్లాడిన మాటలపై సోషల్ మీడియా వేదికగానూ వైఎస్సా్ర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భగ్గుమంటున్నారు. అధికార పార్టీ అండతో ఇష్టానుసారం పేట్రేగి మాట్లాడుతున్నారని.. 2029 ఎన్నికల తర్వాత అసలు సినిమా చూపిస్తామంటూ కామెంట్లు పెడుతున్నారు. సీనియర్ రాజకీయ నేతపై అలాంటి అనుచిత వ్యాఖ్యలు తగదని మరికొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మొత్తంగా కిరాక్ ఆర్పీ వ్యవహారంతో సోషల్ మీడియాలో టీడీపీ వర్సెస్ వైసీపీ కార్యకర్తల మధ్య ట్వీట్ల యుద్ధం జరుగుతోంది.


