బంగారం ధరలు కుప్పకూలాయి. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేని విధంగా పెరిగిన ధరలు సోమవారం నేల చూపులు చూశాయి. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అస్థిర పరిస్థితులు చక్కదిద్దుకునే అవకాశాలు కనిపిస్తుండటంతో పసిడి ధరలు శాంతిస్తున్నాయి. జనవరి నెలలో దాదాపు రూ.లక్షా 80 వేలకు చేరిన బంగారం ధరలు ఫిబ్రవరిలో ఒక్కసారిగా భారీగా పడిపోయి రూ.లక్షా యాభై వేల దిగువకు చేరాయి. ఇంకా కిందకు దిగివచ్చే అవకాశాలు ఉన్నాయనే నిపుణులు అంచనాలు పసిడి ప్రియులకు భారీ ఊరటను కలిగిస్తున్నాయి. కాగా ఫిబ్రవరి 16 సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,310లు తగ్గి రూ.1,56,440 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,200 తగ్గి, రూ.1,43,400 లకు చేరింది. వెండి ధర మాత్రం గత మూడురోజులుగా స్థిరంగా కొనసాగుతోంది. ఈరోజుకూడా కిలో వెండి ధర రూ.2,80,000 గా కొనసాగుతోంది. దేశంలోని వివిధ నగరాల్లో సోమవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,590 దగ్గర ట్రేడవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర రూ.1,43,550 పలుకుతోంది. ముంబై, కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం రూ.1,56,440 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,43,400 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,57,530 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.1,44,400 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,440 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,400 లు పలుకుతోంది. కిలో వెండి ధర రూ.2,80,000లుగా కొనసాగుతోంది. ఈ ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు.. బంగారం కొనడానికి వెళ్లేముందు ధరలు మరోసారి చెక్‌చేసుకొని వెళ్తే మంచిది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చింతలమోరి శివాలయంలో వైభవంగా శివరాత్రి వేడుకలు
ఫిబ్రవరి 17న రాహుగ్రస్త సూర్యగ్రహణం… భారత్‌పై ఎఫెక్ట్ ఎంత
ముక్తిని ప్రసాదించే పంచారామ క్షేత్రాలు.. తెలుగు రాష్ట్రాల్లో ప్రాముఖ్యత
మహాశివరాత్రి రద్దీలో చోరీ.. కీసరగుట్టలో రెచ్చిపోయిన దొంగలు
అర్ధరాత్రి వేళ భక్తుడి ప్రాణాలు కాపాడిన అటవీ సిబ్బంది

