Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Rajasthan Fire: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 7 మంది సజీవ దహనం!

16 February 2026

జస్టిస్ డెలివర్డ్ !! ముగ్గురు మృగాళ్లకు ఉరిని ఖరారు చేసిన కోర్టు

16 February 2026

Success Formula: సక్సెస్‌కి షార్ట్ కట్ వెతుకుతున్నారా? ఈ ఇంగ్లీష్ అక్షరాల వెనుక ఉన్న సీక్రెట్స్ తెలియాల్సిందే!

16 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ttd 300 Rs Ticket Online Booking Release Date,తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మే నెల దర్శన కోటా విడుదల వివరాలివే.. – ttd released details of srivari darshan and accomadation for may 2026
ఆంధ్రప్రదేశ్

Ttd 300 Rs Ticket Online Booking Release Date,తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మే నెల దర్శన కోటా విడుదల వివరాలివే.. – ttd released details of srivari darshan and accomadation for may 2026

.By .16 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ttd 300 Rs Ticket Online Booking Release Date,తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మే నెల దర్శన కోటా విడుదల వివరాలివే.. – ttd released details of srivari darshan and accomadation for may 2026
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. మే నెలకు సంబంధించిన తిరుమల దర్శనం, వసతి గదుల కోటా విడుదల వివరాలను టీటీడీ వెల్లడించింది. ఫిబ్రవరి 18న ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేయనుంది. రూ.300 ప్రత్యేక దర్శనం కోటాను ఫిబ్రవరి 24వ తేదీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. తమ అధికారిక వెబ్ సైట్ ద్వారా భక్తులు శ్రీవారి దర్శనం, వసతి గదులను బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. దళారులను నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేసింది.

Tirumala
తిరుమల మే నెల దర్శన కోటా విడుదల(ఫోటోలు– Samayam Telugu)
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. మే నెల దర్శనం, గదుల కోటా విడుదల వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఫిబ్రవరి 18వ తేదీన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. మే నెలకు సంబంధించిన సుప్రభాతం, అర్చన, తోమాల, అష్టదళ పాదపద్మారాధన సేవల కోటా టికెట్లను ఫిబ్రవరి 18వ తేదీ ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ విడుదల చేయనుంది. ఫిబ్రవరి 20వ తేదీ ఉదయం పది గంటల వరకూ ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన భక్తులు ఫిబ్రవరి 20 నుంచి ఫిబ్రవరి 22వ తేదీ మధ్యాహ్నం 12లోపు సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది.

ఫిబ్రవరి 21వ తేదీ ఉదయం పదింటికి ఊంజల్ సేవ, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను టీటీడీ ఆన్ లైన్‌లో విడుదల చేయనుంది. ఇక మే నెలకు సంబంధించిన వర్చువల్ సేవలు, దర్శన స్లాట్ల కోటాను 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. ఫిబ్రవరి 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదల చేస్తారు. ఫిబ్రవరి 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

తిరుమలలో వృద్ధులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక దర్శనం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. మే నెలకు సంబంధించిన టికెట్ల కోటాను ఫిబ్రవరి 23వ తేదీ మధ్యాహ్నం 3 గంట‌ల‌కు విడుదల చేస్తారు. తిరుమల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఫిబ్రవరి 24న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.మరోవైపు శ్రీవారి భక్తుల కోసం తిరుమల, తిరుప‌తిల‌లో టీటీడీ గదులు కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. మే నెలకు సంబంధించిన గదుల కోటాను ఫిబ్రవరి 24వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేస్తారు.

మరోవైపు ఫిబ్రవరి 27వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీవారి సేవా, పరకామణి సేవ కోటాను టీటీడీ ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేస్తుంది. మరోవైపు భక్తులు దళారులను ఆశ్రయించకుండా.. తమ అధికారిక వెబ్ సైట్ అయిన https://ttdevasthanams.ap.gov.in ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శన టికెట్లు బుక్ చేసుకోవాల‌ని తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో కోరింది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి