దక్షిణ కాశీగా పేరుగాంచిన కోటిపల్లి క్షేత్రం మహాశివరాత్రి పర్వదినం వేళ ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి వారి ఆలయంలో శివరాత్రి మహోత్సవాల సందర్భంగా ‘కోటి దీపారాధన మహోత్సవం’ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ బేడ మండపంపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైకి స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను చేర్చారు. అర్చక స్వాముల వేదమంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ వేదికపై స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దంపతులు, ఆర్డీవో దంపతులు, డీఎస్పీ…జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కోటి దీపారాధన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా ప్రారంభించారు. కోటిపల్లి అంటేనే కోటి ఫలితాలను ప్రసాదించే శైవ క్షేత్రమని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ మహాశివరాత్రి రోజున ఒక్క దీపం వెలిగించినా కోటి దీపాలు వెలిగించినంత పుణ్యం లభిస్తుందని పురాణ వచనం. ఈ నమ్మకంతోనే వేలాది మంది భక్తులు తరలివచ్చి దీపాలు వెలిగించి, స్వామివారి కృపకోసం వేడుకున్నారు. కార్తీక పౌర్ణమిని తలపించేలా ఆలయ ప్రాంగణమంతా దీప కాంతులతో ధగధగలాడిపోయింది. ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించిన భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. ఈ సందర్భంగా.. క్షేత్ర అభివృద్ధికి, భక్తుల సౌకర్యాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Trisha Krishnan: అనవసర వివాదాల్లోకి లాగితే చట్టపరమైన చర్యలు
Gold Price Today: తగ్గిన బంగారం ధర.. కానీ వెండి ధరలు మాత్రం.?
చింతలమోరి శివాలయంలో వైభవంగా శివరాత్రి వేడుకలు
ఫిబ్రవరి 17న రాహుగ్రస్త సూర్యగ్రహణం… భారత్‌పై ఎఫెక్ట్ ఎంత
ముక్తిని ప్రసాదించే పంచారామ క్షేత్రాలు.. తెలుగు రాష్ట్రాల్లో ప్రాముఖ్యత

